Dil Raju: చైతు కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మూవీ 'థాంక్యూ'..

ABN , First Publish Date - 2022-07-13T13:43:18+05:30 IST

చైతు కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మూవీ 'థాంక్యూ' (Thankyou)..అని చిత్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇది.

Dil Raju: చైతు కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మూవీ 'థాంక్యూ'..

చైతు కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మూవీ 'థాంక్యూ' (Thankyou)..అని చిత్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇది. బబ్లీ బ్యూటీ రాశీఖన్నా (Rashi Khanna) ఇందులో చైతు సరసన హీరోయిన్‌గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ (Vikram k kumar) రూపొందిస్తున్నారు. మాళవిక నాయర్ (Malavika Nair) మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'థాంక్యూ' మూవీ అఫీషియల్ ట్రైలర్ ను యూనిట్, అభిమానుల సమక్షంలో విడుదల చేసారు. 


ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ.. 'అభిమానులు మాపై చూపించే ప్రేమ చూస్తుంటే వారి కోసం ఎంత కష్టమైనా సరే పనిచేయాలనిపిస్తుంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్స్ లో మూడు షేడ్స్ ఉంటాయి.. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది'..అని అన్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'చైతు కెరీర్ లో జోష్ సినిమా తరువాత తన లైఫ్ లో ఎప్పటికే నిలిచిపోయే మూవీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో థాంక్యూ మూవీని నిర్మించాం. దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన తరువాత బయటకు వచ్చిన ప్రేక్షకుడికి ఇందులో చైతన్య క్యారెక్టర్ అలానే గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకుతుంది'.. అన్నారు. 


ఇక చిత్ర దర్శకడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఒక మంచి టీమ్ తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. థాంక్యూ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది'.. అన్నారు. హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. 'నా కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో థాంక్యూ మెమొరబుల్ మూవీగా మిగిలిపోతుంది. ఇలాంటి టీమ్ తో పని చేసిన అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేను'.. అన్నారు. కాగా, థాంక్యూ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ఇక మూవీ ఈ నెల 22న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 

Updated Date - 2022-07-13T13:43:18+05:30 IST