యష్‌ను లైన్‌లో పెట్టిన Dil Raju..?

ABN , First Publish Date - 2022-05-25T18:54:36+05:30 IST

కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash). ఈ హీరోను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)

యష్‌ను లైన్‌లో పెట్టిన Dil Raju..?

కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash). ఈ హీరోను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) లైన్‌లో పెట్టినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్నారు. చరణ్ కెరీర్‌లో 15 వ చిత్రం కావడంతో పాటు ఆయన సంస్థలో 50వ చిత్రం కావడం విశేషం. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. 


ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్‌ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. దీనిని పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేయాలని చూస్తున్న ఆయన ఎఫ్ 3, థాంక్యూ లాంటి పక్కా కమర్షియల్ సినిమాలను నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎఫ్ 3 రిలీజ్ కానుంది. అలాగే, థాంక్యూ చిత్రాన్ని జూలై 8న రిలీజ్ చేయబోతున్నారు. 


ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు.. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ యష్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను ఒక్కరే తన సంస్థలో నిర్మిస్తారా లేక కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థలో కలిసి నిర్మిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య దిల్ రాజు ఇతర నిర్మాణ సంస్థలలో కలిసి కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. శాకుంతలం, హిందీ జెర్సీ లాంటి చిత్రాలు ఇలా తయారవుతున్నవే. మరి దిల్ రాజు - యష్‌ల ప్రాజెక్ట్‌పై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-25T18:54:36+05:30 IST