ఆ వార్తలు నిజం కాదు : దిల్ రాజు

ABN , First Publish Date - 2022-07-20T20:46:53+05:30 IST

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) హీరోగా, రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా కథానాయికలుగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘థ్యాంక్యూ’ (Thankyou). విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dilraju) నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.

ఆ వార్తలు నిజం కాదు : దిల్ రాజు

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) హీరోగా, రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా కథానాయికలుగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘థ్యాంక్యూ’ (Thankyou). విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో,  దిల్ రాజు (Dilraju) నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు నిర్మాతలు. అందులో భాగంగా ఇటీవల ‘థ్యాంక్యూ’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రం విశేషాలు తెలిపారు. అలాగే..  టికెట్ రేట్ విషయంలో వస్తున్న వార్తల్ని ఖండిస్తూ దిల్ రాజు వివరణ ఇచ్చారు. 


దిల్ రాజు మాట్లాడుతూ... ‘థాంక్యూ మూవీ సినిమా టికెట్ ధరలను తగ్గించలేదని కొంతమంది మీడియా మిత్రులు ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. కరోనా తర్వాత ఎఫ్ త్రీ మూవీకి టికెట్ ధరలు తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం టికెట్లు అమ్మాం. ఆ తర్వాత వచ్చిన మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఇంకా తగ్గించి అమ్మారు. ఇప్పుడు మేం కూడా థాంక్యూ సినిమాకు అదే ధర నిర్ణయించాం. మల్టీప్లెక్స్ లో 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ లో 150 ప్లస్ జీఎస్టీ గా ధర నిర్ణయించాం. ఇక మీదట వచ్చే చిన్న, మీడియం స్థాయి సినిమాలకు ఇంచుమించు ఇదేవిధంగా టికెట్ ధరలు ఉంటాయి. త్వరలోనే నిర్మాతల అందరం సమావేశమై టికెట్ ధరల విషయంలో ఏకాభిప్రాయానికి వస్తాం. చైతన్య ‘థాంక్యూ’ సినిమాలో తన కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు’.. అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ... ‘భిన్న  ఛాయలు ఉన్న పాత్ర దక్కటం అదృష్టం. దర్శకుడు విక్రమ్తో ఎన్నాళ్లుగానో ఇలాంటి ఒక మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. ఇది ఒక అందమైన ప్రేమ కాథ. పీసీ శ్రీరామ్ (PC Sriram) విజువల్స్ మ్యాజికల్ గా ఉంటాయి’.. అన్నారు.

Updated Date - 2022-07-20T20:46:53+05:30 IST