దిల్‌ రాజు: దయచేసి పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మాట్లాడొద్దు

ABN , First Publish Date - 2021-12-28T01:22:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితులు, టికెట్‌ రేట్లు గురించి సోమవారం దిల్‌ రాజు స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘సినిమా ఇండస్ర్టీ సమస్యల గురించి మాట్లాడటానికి ఏపీ ప్రభుత్వం మాకు అపాయింట్‌మెంట్‌ ఇేస్త చిత్ర పరిశ్రమ తరఫున సీఎం, మంత్రుల్ని కలవాలనుకుంటున్నాం. ఇక్కడ సమస్యలేంటి అన్నది పూర్తిగా వివరించాలనుకుంటున్నాం.

దిల్‌ రాజు: దయచేసి పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మాట్లాడొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితులు, టికెట్‌ రేట్లు గురించి సోమవారం దిల్‌ రాజు స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘సినిమా ఇండస్ర్టీ సమస్యల గురించి మాట్లాడటానికి ఏపీ ప్రభుత్వం మాకు అపాయింట్‌మెంట్‌ ఇేస్త చిత్ర పరిశ్రమ తరఫున సీఎం, మంత్రుల్ని కలవాలనుకుంటున్నాం. ఇక్కడ సమస్యలేంటి అన్నది పూర్తిగా వివరించాలనుకుంటున్నాం. కొంచెం ఓపిక పడితే అంతా పాజిటవ్‌గా ఉంటుంది. తెలంగాణలో వచ్చినట్టే ఏపీలోనూ మంచి జీవో వస్తుందని ఆశిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అందులో సినీ పెద్దలు ఉన్నారు. దయ చేసి ఈ విషయాలపై మిగిలినవారెవరూ మాట్లాడవద్దు. సినిమా వార్తలకు సంబంధించిన విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలి. నిర్మాతలుగా మాకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్‌లకు రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఏపీలో ఐదో ఆటకు అనుమతి కోరాలనుకున్నాం. కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఇవన్నీ తెలియజేయాలనుకుంటున్నాం. జరిగింది వదిలేసి సినిమా పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఏం చేయాలో మాట్లాడతాం. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నా. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి’’ అని అన్నారు. 


Updated Date - 2021-12-28T01:22:28+05:30 IST