Dil raju: సక్సెస్‌తో పరిశ్రమకు ఊపిరిపోశాయి

ABN , First Publish Date - 2022-08-08T22:50:43+05:30 IST

‘‘సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి కష్టకాలంలో దర్శకుడు వశిష్ట ఇండస్ర్టీకి మంచి హిట్‌ ఇచ్చి ఇండస్ర్టీకి ఊపిరిపోశాడు’’ అని దిల్‌ రాజు అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘బింబిసారా’ చిత్రం సక్సెస్‌ మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడారు.

Dil raju: సక్సెస్‌తో పరిశ్రమకు ఊపిరిపోశాయి

‘‘సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి కష్టకాలంలో దర్శకుడు వశిష్ట (Vasista) ఇండస్ర్టీకి మంచి హిట్‌ ఇచ్చి ఇండస్ర్టీకి ఊపిరిపోశాడు’’ అని దిల్‌ రాజు (Dil raju) అన్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘బింబిసారా’ (Bimbisara)చిత్రం సక్సెస్‌ మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడారు. సినిమా సక్సెస్‌ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ సినిమాకైనా దర్శకుడు, నిర్మాత, హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురు ఉంటేనే సినిమాను ఏ స్థ్థాయికైనా తీసుకెళ్లొచ్చు. కొద్దిరోజులుగా ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. జనాలు థియేటర్లకు రావడం లేదు. గడిచిన మూడు నెలల్లో గమనిస్తే.. ‘విక్రమ్‌’, ‘మేజర్‌’ చిత్రాల సక్సెస్‌తో జూన్‌ నెల కళకళలాడింది. జూలై నెల నిరాశపరచింది. ఆ నెలలో ‘బింబిసారా’, ‘సీతారామం’ చిత్రాలు సక్సెస్‌ రూపంలో ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారం చూపే మార్గంలో అందరం శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందుకే ఈ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్స్‌ నిలిపేసి భవిష్యత్తు కోసం, సినిమా మనుగడ కోసం చర్చలు జరుపుతున్నాం’’ అని అన్నారు. 











Updated Date - 2022-08-08T22:50:43+05:30 IST