త్రివిక్రమ్‌కు, నాకు తేడాలొచ్చేది అక్కడే: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-03-25T23:15:05+05:30 IST

గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

త్రివిక్రమ్‌కు, నాకు తేడాలొచ్చేది అక్కడే: పవన్ కల్యాణ్

గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం టోక్యో వెళ్లినప్పుడు నాడు పాస్ పోర్ట్ ఆఫీసర్‌గా ఉన్న రాజశేఖర్‌గారు ఒక చోటుకు తీసుకువెళ్లారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు ఉన్న రెంకోజీ టెంపుల్ అది. నేతాజీ అస్తికలు భద్రపరిచిన ఆయన కుమార్తె అక్కడ ఉన్నారు. ఆమె నేతాజీ అస్తికలు చూపిస్తే నా హృదయం ద్రవించుకుపోయింది. మన దేశంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారికి పెద్ద పెద్ద స్మారకాలు కడతారు. చనిపోతే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తారు. ఇలాంటి మహానుభావుడు, ఇంతటి చైతన్యం కలిగించిన వ్యక్తి ఎందుకు దిక్కు లేకుండా అయిపోయారు అని అనుకున్నా. అక్కడ ఉన్న పుస్తకంలో ఒక మాట రాశాను. నేతాజీ అస్తికలు ఒక రోజు భారతదేశంలోకి తీసుకురావాలి అని రాశాను. ఈ విషయాన్ని ఇంత వరకు ఎవరితో పంచుకోలేదు. ఇది యాదృచ్చికమే కావచ్చు. కానీ అది నేతాజీ పిలుపు..’’ అని చెప్పుకొచ్చారు. 


ఇంకా పుస్తకాలు అంటే తనకి ఎంత ఇష్టమో వివరించే ఓ సందర్భాన్ని ఆయన ఈ వేదికపై పంచుకున్నారు..‘‘త్రివిక్రమ్‌గారికి, నాకు తేడాలొచ్చేది పుస్తకాల దగ్గరే. నా దగ్గర ఏదైనా పుస్తకం ఉండి.. అది త్రివిక్రమ్‌గారికి నచ్చి.. ఇచ్చేయండి అని అడిగితే ఇవ్వలేను. ఆయనకి కనిపించకుండా దాచేస్తాను. ఇంకా ఇంకా అడిగితే.. కావాలంటే మీకో సినిమా ఫ్రీగా చేసిపెడతాను కానీ.. పుస్తకం మాత్రం ఇవ్వలేను.. అని చెప్పేస్తా. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఎవరిమాట వినను. అందుకే త్రివిక్రమ్‌గారికి, నాకు ఈ విషయంలో తేడాలొస్తుంటాయి..’’ అని వివరించారు. పవన్ కల్యాణ్ ఇలా చెబుతుంటే.. క్లాప్స్‌తో జనాలు సభను హోరెత్తించారు.



Updated Date - 2022-03-25T23:15:05+05:30 IST