ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్‌.. టాప్‌లో ‘Diesel’

ABN , First Publish Date - 2022-06-30T03:40:37+05:30 IST

హరీష్ కళ్యాణ్, అతుల్య రవి జంటగా థర్డ్ ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్పీ సినిమాస్ బ్యానర్స్‌పై షణ్ముగం ముత్తుసామి దర్శకత్వంలో ఎం దేవరాజులు నిర్మిస్తున్న రొమాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్

ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్‌.. టాప్‌లో ‘Diesel’

హరీష్ కళ్యాణ్, అతుల్య రవి జంటగా థర్డ్ ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్పీ సినిమాస్ బ్యానర్స్‌పై షణ్ముగం ముత్తుసామి దర్శకత్వంలో ఎం దేవరాజులు నిర్మిస్తున్న  రొమాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ‘డీజిల్’ (Diesel) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం ట్విట్టర్  ఇండియా ట్రెండింగ్‌లో ఈ చిత్ర టైటిల్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవడం విశేషం.


ఇక విడుదల చేసిన పోస్టర్స్‌లో.. ఒక పోస్టర్‌లో డీజిల్ ట్యాంక్‌‌ని పట్టుకున్న హరీష్ కళ్యాణ్, హాఫ్ శారీలో అందంగా కనిపిస్తున్న అతుల్యను రొమాంటిక్‌గా చూస్తుండగా, మరో పోస్టర్‌లో ఇంటెన్స్ మోడ్‌లో డీజిల్‌ ట్యాంక్‌ పైపు పట్టుకుని టెర్రిఫిక్‌గా హరీష్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. రొమాన్స్‌తో పాటు యాక్షన్‌ని జోడించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ ప్రకటించారు.



Updated Date - 2022-06-30T03:40:37+05:30 IST