వామ్మో.. Pooja Hegde కు ఇన్ని కోట్ల ఆస్తి ఉందా..? ఆమె నెల సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-10-14T23:02:22+05:30 IST

ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాల్లో నటించి కుర్రాకారు మదిని దోచిన నటి పూజ హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో నటిస్తూ బిజీగా ఉన్నారమో.

వామ్మో.. Pooja Hegde కు ఇన్ని కోట్ల ఆస్తి ఉందా..? ఆమె నెల సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!

టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటిస్తూ కుర్రకారు మదిని దోచిన నటి పూజ హెగ్డే. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో నటిస్తూ బిజీగా ఉన్నారమో. ఆమె డేట్స్ ఇస్తానంటే నిర్మాతలు ఎంత పారితోషికం ఇవ్వడానికైనా  సిద్ధంగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న నటి ఎంత సంపాదిస్తుందో అనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. ఆమె సంపాదన వివరాలు తెలిస్తే అభిమానులకు మతి పోవాల్సిందే.


ఆమె ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ.2.5కోట్లు తీసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దక్షిణాది చిత్ర సీమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి పూజనే అని వారు వెల్లడిస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో సముద్ర తీరం సమీపంలో ఆమెకు 3 పడక గదుల అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ విలువ కోట్లల్లోనే ఉంటుందని రియల్టీ ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ఆమెకు దాదాపుగా రూ.51కోట్ల ఆస్తి ఉందని మీడియా వర్గాలు వివరిస్తున్నాయి. సినిమాల్లో హీరోయిన్‌గా కాకుండా, యాడ్ షూట్‌లలో నటించడం ద్వారా ఆమె నెలకు దాదాపుగా రూ.50లక్షలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.


పూజ హెగ్డే నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. ఆ మూవీకి రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా  ఆ సినిమాను నిర్మించాయి. వంశీ, ప్రమోద్, బూషణ్ కుమార్, ప్రసీధ తదితరులు ఆ మూవీకీ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె బీస్ట్, భవదీయుడు భగత్ సింగ్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

Updated Date - 2021-10-14T23:02:22+05:30 IST