#BoycottLigerMovie కాంట్రవర్సీకి కారణమిదీ.. Laal Singh Chaddha గురించి Vijay Deverakonda చేసిన కామెంట్స్‌తో..

ABN , First Publish Date - 2022-08-21T02:02:43+05:30 IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) తాజాగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు

#BoycottLigerMovie కాంట్రవర్సీకి కారణమిదీ.. Laal Singh Chaddha గురించి Vijay Deverakonda చేసిన కామెంట్స్‌తో..

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) తాజాగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. రిలీజ్ డేట్  దగ్గరపడటంతో కొంత మంది నెటిజన్స్ లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అందుకు కారణమేంటంటే..


‘లైగర్’ ప్రమోషన్స్‌లో భాగంగా బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌పై విజయ్ దేవరకొండ స్పందించాడు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)కు అనుకూలంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాయ్‌కాట్ ట్రెండ్‌తో నటులతో పాటు సినిమా కోసం కష్టపడిన ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయ్ దేవర కొండ తెలిపాడు. కరీనా కపూర్ కూడా గతంలో ఈ విధంగానే మాట్లాడింది. తమ సినిమా కోసం 250మంది కార్మికులు చెమటను ధారపోశారని పేర్కొంది. చిత్రాన్ని బాయ్‌కాట్ చేయొద్దని చెప్పింది. ‘బాయ్‌కాట్‌లైగర్’ ట్యాగ్‌కు వ్యతిరేకంగా.. విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘ఐసపోర్ట్‌లైగర్’ (#ISupportLiger), ‘అన్‌స్టాపబుల్‌లైగర్’ (#UnstoppableLiger) ట్యాగ్స్‌తో ఎదురుదాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్స్ వార్‌ని చూసిన విజయ్ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తన అభిమానులకు మరింత హుషారునిచ్చాడు. ‘మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు, ఎవడిమాటా వినేదే లేదు..కొట్లాడదాం..’’ అంటూ ఫైర్ ఎమోజీని, అలాగే లైగర్ ట్యాగ్‌ని పోస్ట్ చేశాడు.

Updated Date - 2022-08-21T02:02:43+05:30 IST