NTR T-Shirt Cost: బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ వేసుకున్న టీషర్ట్‌ ఖరీదెంతో ఊహించగలరా..?

ABN , First Publish Date - 2022-07-30T23:01:19+05:30 IST

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు జూనియర్ ఎన్‌టీ‌ఆర్ (Junior NTR). ‘అదుర్స్’, ‘టెంపర్’, ‘జై లవ కుశ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో కనిపించాడు.

NTR T-Shirt Cost: బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ వేసుకున్న టీషర్ట్‌ ఖరీదెంతో ఊహించగలరా..?

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు జూనియర్ ఎన్‌టీ‌ఆర్ (Junior NTR). ‘అదుర్స్’, ‘టెంపర్’, ‘జై లవ కుశ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో కనిపించాడు. తనదైన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు చేరువయ్యాడు. తారక్ ఈ మూవీ ప్రమోషన్స్ అనంతరం బయట ఎక్కడ కనిపించలేదు. తాజాగా తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ (Bimbisara) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తారక్ విచ్చేశాడు. తారక్ ఈ ఈవెంట్‌లో కార్ల్ లాగర్‌ఫెల్డ్ (Karl Lagerfeld) బ్రాండ్‌కు చెందిన నలుపు రంగు టీ-షర్ట్ ధరించాడు. అభిమానులు ఆ టీ-షర్ట్ ధర తెలుసుకుని అవాక్కయ్యారు.   


‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ ధరించిన టీ-షర్ట్ ధర రూ. 24వేలు అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. అభిమానులు కూడా ఆ పిక్స్‌ను షేర్ చేస్తుండటంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో ఎన్‌టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చేంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటాం. మీరు కాలర్‌ ఎగరేసుకునేలా సినిమాలు చేయడమే మా బాధ్యత అని గతంలో చెప్పా. అన్నయ్య నటించిన ఈ సినిమా విషయంలోనూ అదే చెబుతున్నా.. అదే జరుగుతుంది కూడా! కల్యాణ్‌ అన్న సినీ కెరీర్‌ను గుర్తు చేసుకుంటే ‘బింబిసార’కు ముందు బింబిసార’ తర్వాత అనాల్సిందే. ఈ చిత్రం కోసం రక్తాన్ని ధారపోసి నటుడిగా తనని తాను మలుచుకున్నాడాయన. ఈ పాత్రను అతడు తప్ప ఎవరూ చేయలేరు. ఆగస్టు 5న విడుదల కానున్న ‘సీతారామం’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా"అని పేర్కొన్నాడు.





Updated Date - 2022-07-30T23:01:19+05:30 IST