Alia Bhatt: ప్రమోషన్స్‌లో ఆలియా ధరించిన డ్రెస్ ధర ఊహించగలరా

ABN , First Publish Date - 2022-08-01T21:50:53+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి ఆలియా భట్ (Alia Bhatt). చివరగా ‘గంగూబాయి కతియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి.

Alia Bhatt: ప్రమోషన్స్‌లో ఆలియా ధరించిన డ్రెస్ ధర ఊహించగలరా

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి ఆలియా భట్ (Alia Bhatt). చివరగా ‘గంగూబాయి కతియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యాయి. హీరోయిన్‌గా నటిస్తూనే ఆలియా తొలిసారి నిర్మాతగా మారింది. ‘డార్లింగ్స్’ (Darlings)ను నిర్మించింది. ఈ చిత్రంలో విజయ్ వర్మ (Vijay Varma), షెఫాలీ షా (Shefali Shah), రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ప్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 5నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆలియా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఓ ఈవెంట్‌లో ఆలియా నలుపు రంగు అనార్కలీ డిజైనర్ వేర్‌తో దర్శనమిచ్చింది. అభిమానులు ఈ డ్రెస్‌కు ఫిధా అయ్యారు. అదే విధంగా డ్రెస్ ధర తెలుసుకుని అవాక్కయ్యారు. 


ఆలియా ధరించిన నలుపు రంగు అనార్కలీ డ్రెస్‌పై గ్లాస్ వర్క్ కూడా ఉంది. ఈ  డ్రెస్ ధర రూ. 45వేలు అని తెలియడంతో అవాక్కవడం అభిమానుల వంతయింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ‘రాకీ ఔర్, రాణీ కీ ప్రేమ్ కహానీ’ షూటింగ్‌ను కూడా ఆలియా పూర్తి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.



Updated Date - 2022-08-01T21:50:53+05:30 IST