Aamir Khan Net Worth: రూ.180 కోట్లతో తీసిన Lal Singh Chaddha పోయింది సరే.. అసలు ఆమిర్ ఖాన్‌ ఆస్తి ఎంతో తెలుసా..?

ABN , First Publish Date - 2022-08-14T21:35:15+05:30 IST

పాత్ర కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). రెండు, మూడేళ్లకు ఓ సినిమాను చేస్తుంటాడు. అందుకే అతడిని మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అని పిలుస్తారు. ఆమిర్ తాజాగా నటించిన

Aamir Khan Net Worth: రూ.180 కోట్లతో తీసిన Lal Singh Chaddha పోయింది సరే.. అసలు ఆమిర్ ఖాన్‌ ఆస్తి ఎంతో తెలుసా..?

పాత్ర కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). రెండు, మూడేళ్లకు ఓ సినిమాను చేస్తుంటాడు. అందుకే అతడిని మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అని పిలుస్తారు. ఆమిర్ తాజాగా నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Lal Singh Chaddha). వయాకాం ప్రొడక్షన్స్‌తో కలసి ఆమిరే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. మేకర్స్ రూ.180కోట్ల భారీ బడ్జెట్‌‌ను ఈ మూవీ కోసం వెచ్చించారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఆమిర్‌కు ఎంత నష్టం వచ్చిందో అని అందరు ఆరా తీస్తున్నారు. ఆమిర్ ఖాన్‌ కున్న ఆస్తిపాస్తులతో పోల్చుకుంటే ఈ నష్టం చాలా తక్కువ. మరి, ఈ ఆమిర్ ఆస్తిపాస్తులపై ఓ లుక్కేద్దామా..     


ఆమిర్ ఖాన్‌కు ముంబై తీర ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం ఉంది. ఈ భవనంలో రెండు అంతస్తులున్నాయి. దాదాపుగా 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉంది. ఆమిర్ 2009లో రూ. 18కోట్లు వెచ్చించి ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నేటి ‌మార్కెట్‌ ధర ప్రకారం దాని విలువ రూ. 60కోట్లు అని అంచనా. ముంబైలో విలాసవంతమైన ప్రాంతాలైన బెల్లా విస్టా, పాలీ హిల్, బాంద్రా, మెరీనాలోను అనేక ప్లాట్‌లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆమిర్ పూర్వీకులకు 22ఇళ్లు ఉన్నాయి. ఆమిర్ ఖాన్ సోదరి, సోదరుడు ఈ ఇళ్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఇళ్ల విలువ రూ. 30కోట్లు అని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.   


ఆమిర్ ఖాన్‌కు పంచగనిలో ఓ ఫామ్‌హౌస్ ఉంది. 2013లో రూ. 7కోట్లతో దానిని కొనుగోలు చేవాడు. అతడికి ముంబైలో నాలుగు ఆఫీస్‌లు ఉన్నాయి. వీటి విలువ రూ. 35కోట్లు. ఆమిర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 50కోట్ల నుంచి రూ. 60కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని సమాచారం. లాభాల్లోను షేర్ ఉంటుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. యాడ్‌ల ద్వారాను భారీగా అర్జిస్తాడట. ఒక్కో కమర్షియల్‌కు రూ. 12కోట్లను పారితోషికంగా తీసుకుంటాడట. ఈ స్టార్ హీరోకు కార్స్ అంటే చాలా మక్కువ. అందుకే మెర్సిడెస్ బెంజ్ యస్600, రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెంట్లీ కాంటినెంటల్, బీఎమ్‌డబ్ల్యూ-6 సిరీస్ వంటి కార్లకు తన గ్యారేజీలో చోటిచ్చాడు. ఆమిర్‌‌కు అనేక స్థిర, చరాస్తులు ఉన్నాయి. మార్కెట్ ధర ప్రకారం ఆమిర్ ఆస్తి విలువ దాదాపుగా రూ.1562కోట్లు అని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.  

Updated Date - 2022-08-14T21:35:15+05:30 IST