Alia Bhatt: 9న ఫస్ట్ బేబీ.. త్వరలోనే రెండో బేబీ..

ABN , First Publish Date - 2022-09-03T21:51:47+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ

Alia Bhatt: 9న ఫస్ట్ బేబీ.. త్వరలోనే రెండో బేబీ..

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలసి నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2న ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆలియా ధరించిన డ్రెస్ చూపరుల్ని ఆకట్టుకుంది. అందరు చర్చించుకునేలా చేసింది.


‘బ్రహ్మాస్త్ర’ హైదరాబాద్ ఈవెంట్‌లో ఆలియా భట్ పింక్ కలర్ డ్రెస్ ధరించింది. ఈ దుస్తుల ముందు భాగంలో లవ్ అని రాసి ఉండగా, వెనుక భాగంలో ‘బేబీ ఆన్ బోర్డ్’ అని రాసి ఉంది. ఆలియా ‘బ్రహ్మాస్త్ర’ ను మొదటి బేబీగా, పుట్టబోయే బుజ్జాయిని రెండో బేబీగా భావిస్తుంది. అందువల్లే ఆమె ఈ విధంగా డ్రెస్ ధరించింది. ఆలియా ఈ విధంగా డ్రెస్ ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించిన కొన్నాళ్లకే బ్రహ్మాస్త్ర సినిమాకు ఆమె ఒకే చెప్పింది. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే రణ్‌బీర్ కపూర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట దాదాపుగా ఐదేళ్లు డేటింగ్ చేశారు. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ‘బ్రహ్మాస్త్ర’ ను మొదటి బేబీగా సంబోధిస్తుంది. ఫస్ట్ బేబీ సెప్టెంబర్ 9న థియేటర్స్‌లోకి వచ్చేటప్పటికే ఆలియా ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆలియా, రణ్‌బీర్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు జాన్‌లోనే సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ‘మా బేబీ రాబోతుంది’ అని అప్పట్లో ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-09-03T21:51:47+05:30 IST