Vijay Deverakonda కి ఇప్పట్లో పాన్ ఇండియా క్రేజ్ రానట్టేనా..?

ABN , First Publish Date - 2022-09-04T14:58:57+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది లైగర్ (Liger). దీనితో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవ్వాలనుకున్నాడు.

Vijay Deverakonda కి ఇప్పట్లో పాన్ ఇండియా క్రేజ్ రానట్టేనా..?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది లైగర్ (Liger). దీనితో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవ్వాలనుకున్నాడు. కానీ, ఆ ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టాయి. ఇప్పటి వరకు ఈ హీరో కెరీర్‌లో హిట్ సినిమాలంటే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మాత్రమే. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తిరగబడినవే. అయినా ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన రౌడీ స్టార్ అనే ఇమేజ్ మాత్రం ఇంకా అలా కొనసాగుతూనే ఉంది.


అంతేకాదు, అర్జున్ రెడ్డి సినిమాలో చూపించిన యాటిట్యూడ్ తన నెక్స్ట్ సినిమాలలోనూ చూపిస్తున్నాడు. అదే జనాలకి బాగా బోర్ కొట్టేస్తుంది. బయట ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో కూడా చాలా రూడ్‌గా మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతున్నాడు. దీనికి ఉదాహరణ ఇటీవల లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో విజయ్ ప్రవర్తించిన తీరునే తీసుకోవచ్చు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ (Prabhas), పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun), ఆర్ఆర్ఆర్ సినిమాతో, చరణ్, తారక్‌ల రేంజ్‌లో విజయ్ కూడా లైగర్ మూవీతో క్రేజ్ తెచ్చుకోవాలనుకున్నాడు.


ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్‌గా ఊపేస్తాననుకున్నాడు. కానీ, పూరి జగన్నాథ్ (Puri Jagannath) తన రొటీన్ మేకింగ్‌తో విజయ్‌కి ఫ్లాపిచ్చాడు. దీంతో విజయ్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్. దీనివల్ల పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకుంటాడనేది అయ్యేపని కాదు. ఇక పూరి దర్శకత్వంలో చేస్తున్న జనగణమన విషయం ఇప్పుడే చెప్పలేము. దీనిని బట్టి చూస్తే విజయ్ దేవరకొండకి.. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్‌ల మాదిరిగా పాన్ లెవల్‌లో క్రేజ్ రావాలంటే ఇప్పట్లో జరగడం కష్టమని చెప్పుకుంటున్నారు. మరి ఆ రేంజ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పడుతుందో, ఆ దర్శకుడెవరో చూడాలి.  

Updated Date - 2022-09-04T14:58:57+05:30 IST