పెళ్లి చీరను చైతన్యకు సమంత తిరిగిచ్చేసిందా..?

ABN , First Publish Date - 2022-03-09T23:57:48+05:30 IST

ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత సడన్‌గా విడాకులు ప్రకటించి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్ 2న వేర్వేరుగా...

పెళ్లి చీరను చైతన్యకు సమంత తిరిగిచ్చేసిందా..?

ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత సడన్‌గా విడాకులు ప్రకటించి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్ 2న వేర్వేరుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..


పెళ్లి రోజు సామ్ ధరించిన చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ శారీ ఫిల్మ్ మేకర్ దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. నాగచైతన్యకు దగ్గుబాటి రాజేశ్వరి అమ్మమ్మ అవుతుంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు గౌరవంగా చై అమ్మమ్మకు సంబంధించిన చీరను సమంత వివాహం రోజు కట్టుకుంది. ఆ శారీ దగ్గుబాటి కుటుంబానికి చెందినది కాబట్టి సామ్ తిరిగిచ్చేసిందని సమాచారం. నాగచైతన్యకు సంబంధించిన ఏ వస్తువును కూడా తన వద్ద ఉంచుకోకూడదని సమంత నిర్ణయించుకుందంట. అందువల్ల ఆ శారీని కూడా రిటర్న్ చేసిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


నాగచైతన్య, సమంత‌లు హీరో, హీరోయిన్లుగా మెదటిసారిగా ‘ఏ మాయ చేసావె’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో పనిచేసేటప్పుడే వీరిద్దరికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’ సినిమాల్లో జంటగా కనిపించారు. 

Updated Date - 2022-03-09T23:57:48+05:30 IST