S S Thaman అంటే వాళ్లకి భయం మొదలైందా..?

ABN , First Publish Date - 2022-09-10T14:20:19+05:30 IST

ఇటీవల కాలంలో మ్యూజిక్ సెన్షేషన్‌గా క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ (S S Thaman) అంటే ఇప్పుడు అందరు హీరోల అభిమానుల్లో కాస్త భయం, టెన్షన్ మొదలవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

S S Thaman అంటే వాళ్లకి భయం మొదలైందా..?

ఇటీవల కాలంలో మ్యూజిక్ సెన్షేషన్‌గా క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ (S S Thaman) అంటే ఇప్పుడు అందరు హీరోల అభిమానుల్లో కాస్త భయం, టెన్షన్ మొదలవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆయన అందిస్తున్న సంగీతం..నేపథ్య సంగీతమే. థమన్ కెరీర్ ప్రారంభంలో సంగీతమందించిన చిత్రాలు కిక్, మిరపకాయ్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. దాంతో అప్పట్లో వరుసగా గ్యాప్ లేకుండా మోత మోగించారు. అదే సమయంలో థమన్ సంగీతంలో రొటీన్ ట్యూన్స్, డప్పుల మోత ఎక్కువగా వినిపిస్తుందని కామెంట్స్ వినిపించాయి.


అయినా ఆఫర్స్ మాత్రం బాగానే వచ్చాయి. రాను రాను థమన్ సంగీతం అంటే అటు మన మేకర్స్‌కి ఇటు అభిమానులకు, ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. దాంతో కాస్త ఫామ్ కోల్పోయాడు. మళ్ళీ అల వైకుంఠపురములో సినిమా నుంచి పుంజుకున్నాడు. ఈ మూవీ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలకి సంగీతం అందిస్తుంది థమన్ మాత్రమే. అయితే, "మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది" అనే సామెత మాదిరిగా ఖాళీ లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నా కొద్దీ..మ్యూజిక్‌లో తేడా వినిపిస్తోంది.


ఇది చాలామంది అభిప్రాయపడుతున్నదే..ఒప్పుకొని తీరాల్సిందే. తన ట్యూన్స్‌ని తానే కాపీకొడుతున్నాడని హీరోల అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెటిజన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని అందరూ చెప్పుకున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో, క్రాక్, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, అఖండ వంటి చిత్రాలే. అయితే, ఇప్పుడు అది కూడా రిపీట్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థమన్ చేతిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), మహేష్ (Mahesh) - త్రివిక్రమ్ (Trivikram) మూవీ, విజయ్ వారసుడు, రామ్ చరణ్ (Ram Charan)- శంకర్‌ (Shankar)ల మూవీ..ఇలా పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి. 


ఇప్పుడు ఈ హీరోల అభిమానులే బాగా టెన్షన్ పడుతున్నారట. ఇటీవల చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ రిలీజైంది. దీనికి థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మీద తెగ ట్రోల్ చేశారు. మరి..ఇన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి ఒప్పుకొని ఇలా ఇబ్బందులు పడే దానికంటే సెటిల్డ్‌గా కొన్ని చిత్రాలనే కమిటై మంచి మ్యూజిక్ ఇవ్వొచ్చుగా.. అనేది చాలామంది సలహా. మరి ఇది థమన్ పట్టించుకుంటారో లేదో చూడాలి. 

Updated Date - 2022-09-10T14:20:19+05:30 IST