'లీడర్' సీక్వెల్‌కు శేఖర్ కమ్ముల హీరోను మార్చేశాడా..?

ABN , First Publish Date - 2022-04-27T19:13:30+05:30 IST

'లీడర్' సీక్వెల్‌కు శేఖర్ కమ్ముల హీరోను మార్చేశాడా..? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి అర్థమవుతోంది. ఇటీవలే నాగ చైతన్య - సాయి పల్లవిలతో 'లవ్ స్టోరి' చిత్రాన్ని తీసి క్లాస్ హిట్ అందుకున్న కమ్ముల

'లీడర్' సీక్వెల్‌కు శేఖర్ కమ్ముల హీరోను మార్చేశాడా..?

'లీడర్' సీక్వెల్‌కు శేఖర్ కమ్ముల హీరోను మార్చేశాడా..? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి అర్థమవుతోంది. ఇటీవలే నాగ చైతన్య - సాయి పల్లవిలతో 'లవ్ స్టోరి' చిత్రాన్ని తీసి క్లాస్ హిట్ అందుకున్న కమ్ముల తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్‌తో ఓ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించాడు. అలాగే, రానాతో 'లీడర్' సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తీయనున్నట్టు ..తెలిపారు. త్వరలో రానాకు 'లీడర్' సీక్వెల్ స్టోరీని నరేట్ చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాను తమిళ హీరో సూర్యతో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.  

Updated Date - 2022-04-27T19:13:30+05:30 IST