ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదంటోన్న ధనుష్

ABN , First Publish Date - 2022-03-06T23:36:34+05:30 IST

బయోపిక్స్‌కు బాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. ‘మేరీకోం’,

ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదంటోన్న ధనుష్

బయోపిక్స్‌కు బాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. ‘మేరీకోం’, ‘ఎం ఎస్. ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’, ‘గుంజన్ సక్సేనా’ వంటి సినిమాలు అక్కడ సంచలన విజయం సాధించాయి. బయోపిక్‌ల బాటనే అనుసరిస్తూ రూపొందిన చిత్రం ‘ఝుండ్’. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ‘సైరాట్’ తో జాతీయ అవార్డు‌ను పొందిన నాగరాజ్ మంజులే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 4న విడుదలైన ఈ సినిమా అభిమానుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వీక్షించారు. చిత్ర బృందాన్ని పొగడ్తాలతో ముంచెత్తారు. 


ధనుష్ ఈ సినిమాను ‘మాస్టర్ పీస్’ అని అభివర్ణించారు. ‘‘ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. సినిమా అద్భుతంగా ఉంది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి. నేను ‘ఝుండ్’ లోని 1000 టెక్నికల్ అంశాల గురించి మాట్లాడగలను. కానీ, సినిమా అంటే భావోద్వేగం. ఈ అనుభూతిని పొందాలంటే ప్రతి ఒక్కరూ మూవీని చూడాలి. ఈ చిత్రంలో అమితాబ్ అద్భుతంగా నటించారు. చిత్ర బృందాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇటువంటి మూవీని మనకిచ్చినందుకు నాగరాజ్ మంజులేకు థ్యాంక్స్’’ అని ధనుష్ చెప్పారు.


నాగపూర్‌కు చెందిన స్పోర్ట్స్ టీచర్ విజయ్ బార్సే జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఝుండ్’ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆకాష్ తోషార్, రింకు రాజ్ గురు  కీలక పాత్రలు పోషించారు. టీ సిరీస్, తాండవ్ ఫిలింస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.


Updated Date - 2022-03-06T23:36:34+05:30 IST