Pushpa 2 గ్యాప్ ఫిల్ చేసేందుకు వస్తోన్న ‘పుష్పరాజ్ ది సోల్జర్’

ABN , First Publish Date - 2022-08-05T01:14:27+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సీక్వెల్..

Pushpa 2 గ్యాప్ ఫిల్ చేసేందుకు వస్తోన్న ‘పుష్పరాజ్ ది సోల్జర్’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సీక్వెల్ కోసం ఇప్పుడంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. కానీ ఇంత వరకు సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదల కావడానికి చాలా టైమ్ పట్టేట్టు ఉంది. అయితే ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి నేనున్నానంటూ.. వస్తున్నాడు ‘పుష్పరాజ్ ది సోల్జర్’ (Pushpa Raj The Soldier). ఎవరీ ‘పుష్పరాజ్ ది సోల్జర్’? అనుకుంటున్నారా! యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా (Dhruva Sarja). ఆయన హీరోగా.. రచితా రామ్ (Rachita Ram), హరిప్రియ (Haripriya) హీరోయిన్లుగా కన్నడలో రూపొందిన ‘పుష్పరాజ్ ది సోల్జర్’ చిత్రాన్ని.. ఆర్.ఎస్. ప్రొడక్షన్స్, గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ బ్యానర్లపై బొడ్డు అశోక్ (Boddu Ashok) తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా కన్నడలో నటించిన ‘పుష్పరాజ్ ది సోల్జర్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగు ప్రేక్షకులు మెచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌గారి ‘పుష్ప’ సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంత బాగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకి మేము ‘పుష్పరాజ్ ది సోల్జర్’ అని టైటిల్ ప్రకటించగానే.. భారీ క్రేజ్ వచ్చేసింది. నిర్మాతగా నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్‌గారి చిత్రాలను ఎలాగైతే ఆదరించారో.. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఆగస్టు 19న గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ పుష్పరాజ్ కూడా తెలుగు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటాడని భావిస్తున్నాం..’’ అని తెలిపారు.

Updated Date - 2022-08-05T01:14:27+05:30 IST