Dhostan: భార్య కోరిక మేరకు.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-11-04T17:47:42+05:30 IST

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ (Sri Surya Movies Creations) పతాకంపై సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా

Dhostan: భార్య కోరిక మేరకు.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ (Sri Surya Movies Creations) పతాకంపై సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోస్తాన్’ (Dhostan). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి (Basireddy) చేతుల మీదుగా ఈ టీజర్‌ని మేకర్స్ లాంఛ్ చేశారు. టీజర్ విడుదల అనంతరం బసిరెడ్డి మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు ‘దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శకనిర్మాత సూర్యనారాయణ అక్కమ్మకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద  బెస్ట్.. అని తెలిపారు.


చిత్ర దర్శకనిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ మాట్లాడుతూ.. మా ‘దోస్తాన్’ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన పెద్దలకు ధన్యవాదాలు. నా భార్య కోరిక మేరకు నేను సినిమా తీయాలని ఎన్నో కథలు విన్నాను. అవేవి నాకు నచ్చలేదు. సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేశాము. అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ఈ సినిమా పూర్తి చేయడానికి 96 రోజులు పట్టింది. ఇందులోని ఫైట్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో  సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.. అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు. (Dhostan teaser Released)

Updated Date - 2022-11-04T17:47:42+05:30 IST