ఈ ప్రమాదం వల్ల నేనో గుణపాఠం నేర్చుకున్నా.. మీరలా చేయొద్దు: బాలీవుడ్ సీనియర్ నటుడు

ABN , First Publish Date - 2022-05-02T18:26:05+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం

ఈ ప్రమాదం వల్ల నేనో గుణపాఠం నేర్చుకున్నా.. మీరలా చేయొద్దు: బాలీవుడ్ సీనియర్ నటుడు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఇటీవలే డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చారు. తాజాగా ఈ 86 ఏళ్ల నటుడు తన ఆరోగ్యం గురించి తెలుపుతున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


అందులో ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్స్, ఏది అతిగా చేయొద్దు. నేను అలా చేయడం వల్లే వీపులో కండరాల్లో నొప్పి వచ్చింది. అందువల్లే నేను దాదాపు నాలుగు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. అదెంతో కష్టంగా అనిపించింది. చివరికి మీ ప్రార్థనలు, అభిమానం కారణంగా నేను ఆరోగ్యంగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు నేను చాలా బావున్నాను. ఇకనుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను.  మీరు నా గురించి బాధ పడకండి. లవ్ యూ ఆల్’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ‘ఫ్రెండ్స్.. ఏ విషయాన్ని అతిగా చేయొద్దు. మీ పరిమితులను తెలుసుకోండి. నేను అలా చేసే గుణపాఠం నేర్చుకున్నాను’ అంటూ ధర్మేంద్ర రాసుకొచ్చారు. ఆ వీడియోని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-05-02T18:26:05+05:30 IST