ఇది అన్ని సినిమాల్లా ఉండదు

ABN , First Publish Date - 2022-12-10T06:10:35+05:30 IST

తప్పుచేసిన వారిని శిక్షించాలనే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ధర్మః’. విజయ్‌కుమార్‌ యల్కోటి దర్శకత్వంలో..

ఇది అన్ని సినిమాల్లా ఉండదు

తప్పుచేసిన వారిని శిక్షించాలనే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ధర్మః’. విజయ్‌కుమార్‌ యల్కోటి దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్‌ పరిగెల, సతీష్‌కుమార్‌ చిప్పగిరి నిర్మిస్తున్నారు. ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి, ఈషాన్‌ నటిస్తున్నారు. ఇటీవలె చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్‌ చిత్రంలా ఉండదు. దర్శకుడు రియలిస్టిక్‌గా తెరకెక్కించాడు’ అన్నారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల మందుకు తీసుకొస్తామని చిత్ర దర్శకుడు తెలిపారు. 

Updated Date - 2022-12-10T06:10:35+05:30 IST