‘ఆ విభజన’... తాను అంగీకరించనంటోన్న Dhanush

ABN , First Publish Date - 2021-12-21T02:44:57+05:30 IST

తమిళ, తెలుగు ప్రేక్షకులకి ఫేవరెట్ స్టార్ అయిన ధనుష్ హిందీ ఆడియన్స్‌కి కూడా సుపరిచితుడే. ఆయన గతంలోనే బాలీవుడ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అయితే, తాజాగా ‘అత్రంగీ రే’ సినిమాతో మరోమారు బీ-టౌన్ బాట పట్టాడు. త్వరలోనే...

‘ఆ విభజన’... తాను అంగీకరించనంటోన్న Dhanush

తమిళ, తెలుగు ప్రేక్షకులకి ఫేవరెట్ స్టార్ అయిన ధనుష్ హిందీ ఆడియన్స్‌కి కూడా సుపరిచితుడే. ఆయన గతంలోనే బాలీవుడ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అయితే, తాజాగా ‘అత్రంగీ రే’ సినిమాతో మరోమారు బీ-టౌన్ బాట పట్టాడు. త్వరలోనే అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ స్టారర్ జనం ముందుకు రాబోతోంది.  ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్, సారా లాంటి వారితో కలసి నటించటం గొప్పగా ఉందని చెబుతున్నాడు ధనుష్. ‘అత్రంగీ రే’ కథ తనకు ఎంతగానో నచ్చటం వల్లే ఆరేళ్ల విరామం తరువాత హిందీ తెర మీదకి తిరిగి వచ్చానని ఆయన అన్నాడు... 


ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటించే ధనుష్ ఉత్తరాది, దక్షిణాది తేడాల గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడు. నార్త్ అండ్ సౌత్ అనే డివిజన్‌కి తాను మొదట్నుంచీ వ్యతిరేకమని కోలీవుడ్ స్టార్ అన్నాడు. ‘‘ఉండేది కేవలం భారతీయ సినిమా మాత్రమే. దాన్ని అలానే ఉంచాలి...’’ అంటూ తన స్పందన తెలియాజేశాడు. ‘‘రాను రాను వివిధ భారతీయ సినీ పరిశ్రమల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి కదా... మీ అభిప్రాయం ఏంటి?’’ అని మీడియా ప్రతినిధులు అడుగగా ఆయన తన మనసులోని మాట చెప్పాడు. కాగా ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్ చుట్టేసిన ధనుష్ త్వరలో ‘ద గ్రే మ్యాన్’ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు! 

Updated Date - 2021-12-21T02:44:57+05:30 IST