Dhanush: వైరల్‌గా హాలీవుడ్ మూవీ వీడియో..

ABN , First Publish Date - 2022-07-12T14:55:51+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ మూవీ నుంచి తాజాగా ఓ వీడియో వచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. ఈ యంగ్ హీరో తమిళంలో వరుసగా క్రేజీ చిత్రాకు చేస్తున్న సంగతి తెలిసిందే.

Dhanush: వైరల్‌గా హాలీవుడ్ మూవీ వీడియో..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ మూవీ నుంచి తాజాగా ఓ వీడియో వచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. ఈ యంగ్ హీరో తమిళంలో వరుసగా క్రేజీ చిత్రాకు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, తెలుగులో స్ట్రైట్ సినిమాను చేస్తున్నాడు. 'సార్' (Sir) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలోనూ 'వాతి' (Vaathi) పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ధనుష్ కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మన మేకర్స్ కూడా తనతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.


ఇక ఇప్పటికే, హిందీలో 'అంత్రరంగీరే' సినిమాను చేసిన ధనుష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. 'ది గ్రే మ్యాన్' (The Gray Man) అనే టైటిల్‌తో రూపొందుతుండగా ఈ మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రసో బ్రదర్స్ ప్రముఖ హీరో క్రిస్ ఇవాన్స్ తో రూపొందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ధనుష్ కూడా కీలక పాత్ర చేస్తుండటం విశేషం.


అయితే, గత కొన్నాళ్ల క్రితం ట్రైలర్ రిలీజ్ చెయ్యగా, అది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కానీ, దీనిలో ధనుష్ ని చిన్న బిట్ లో మాత్రమే చూపించారు. దాంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ, ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. ధనుష్ సత్తా ఏంటో తెలిసేలా హాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని మేకర్స్ ఈ వీడియో ద్వారా హింట్ ఇచ్చారు. ఇక ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా, జూలై 22న నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కాబోతున్న 'ది గ్రే మ్యాన్' ఇంగ్లీష్, తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లోనూ విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో ధనుష్ హాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-07-12T14:55:51+05:30 IST