Dhanush: 'మారన్' ఓటీటీ రిలీజ్ టైమ్ వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-03-10T18:18:49+05:30 IST

నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమయింది.

Dhanush: 'మారన్' ఓటీటీ రిలీజ్ టైమ్ వచ్చేసింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మారన్' నేరుగా డిజిటల్ రిలీజ్ కాబోతోంది. రేపు (మార్చి 11) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమయింది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను ఓటీటీ వారు వెల్లడించారు. దాదాపుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లు రిలీజ్ చేస్తున్న సినిమాలు 12 ఏఎంకి స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ, 'మారన్' సినిమా విషయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాన్ మార్చేసింది. రేపు (మార్చి 11) సాయంత్రం 5 గంటల నుండి ఈ సినిమా ప్రసారానికి అందుబాటులో ఉంటుందని డిస్నీ ప్లాట్‌ఫార్మ్ ప్రకటించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ మాళవిక మోహన్ ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ నరేన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-03-10T18:18:49+05:30 IST