Nene Vasthunna Twitter Review: ధనుష్ మూవీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-09-29T15:22:43+05:30 IST

టాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది తమిళ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు...

Nene Vasthunna Twitter Review: ధనుష్ మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది తమిళ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో ఇక్కడ విడుదల అవుతూ ఉంటుంది. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘నానే వరువన్ (Naane Varuven)’. తెలుగులో ‘నేనే వస్తున్నా (Nene Vasthunna)’. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇందుజ రామచంద్రన్, ఎలిసబెట్ అవ్రమిడౌ గ్రాన్లండ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


‘తుళ్లువతో ఇహలా’, ‘కథల్ కొండేన్’, ‘పుతుప్పేటై’, ‘మాయకం ఎన్న’ చిత్రాల తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదో చిత్రం ‘నానే వరవాన్’. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను నిర్మించాడు. ఈ రోజు (సెప్టెంబర్ 29న) విడుదలైన చిత్రాన్ని చూసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇస్తున్నారు. అందులో.. ‘నేనే వస్తున్నా ఓ మాస్టర్ పీస్. సందేహం లేకుండా ఈ ఏడాదిలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటి. దీన్ని మిస్ అవ్వకండి. సినిమా పూర్తైన దాని ప్రభావం నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుది’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.


అలాగే.. ‘ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్టర్ పీస్. ధనుష్ నెగిటివ్ షేడ్‌లో ఇరగదీశాడు. సెల్వ రాఘవన్ స్టైల్ మళ్లీ వచ్చేశాడు’ అని మరొనెటిజన్ రాసుకొచ్చాడు. జీనియస్ సెల్వరాఘవన్ మళ్లీ వచ్చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.. (Nene Vastunna Twitter Review)











Updated Date - 2022-09-29T15:22:43+05:30 IST