Dhanush: ‘ది గ్రే మ్యాన్’ సీక్వెల్‌లో ధనుష్.. హింటిచ్చిన హీరో..

ABN , First Publish Date - 2022-08-06T21:34:12+05:30 IST

వైవిధ్య భరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘ఆడు కాలం’, ‘కర్ణన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. పాత్ర నచ్చితే ఏ భాషకు చెందిన చిత్రంలో అయినా

Dhanush: ‘ది గ్రే మ్యాన్’ సీక్వెల్‌లో ధనుష్.. హింటిచ్చిన హీరో..

వైవిధ్య భరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’, ‘ఆడు కాలం’, ‘కర్ణన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. పాత్ర నచ్చితే ఏ భాషకు చెందిన చిత్రంలో అయినా నటిస్తాడు. తాజాగా ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man). ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి. ఆర్మాన్, జెస్సికా హెన్విక్, రెజ్-జీన్ పేజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ర్యాన్ గ్యాస్లింగ్ సీఐఏ ఏజెంట్ సియర్రా సిక్స్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో ధనుష్ కనిపించేది కొద్ది సేపే అయినా అతడి నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ‘ది గ్రే మ్యాన్’ కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు రుస్సో బ్రదర్స్ (Russo Brothers) ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతుంది. సీక్వెల్‌లో ధనుష్ నటించనున్నట్టు హింట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఓ మెసేజ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. 


స్టార్ హీరో ధనుష్ ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ను షర్ చేశాడు. ‘‘సిక్స్. నేను లోన్ వోల్ఫ్. మనమిద్దరం ఒకే వ్యక్తి కోసం వెతుకుతున్నామని నేను విన్నాను. నీకు ఓ సలహాను ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి కోసం వెతికి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక వేళ ఆ వ్యక్తి మొదటగా నాకు దొరికితే నీకు వెతకడానికి ఏం ఉండదు. నీకు మొదటగా దొరికితే నేను నిన్ను వెతుకుంటూ వస్తాను. మనిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు ఏం లేవు’’ అని ధనుష్ తెలిపాడు. మెసేజ్ కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘ది గ్రే మ్యాన్ యూనివర్స్ విస్తరిస్తుంది. సీక్వెల్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. లోన్ వోల్ఫ్ సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అని ధనుష్ చెప్పాడు. ‘ది గ్రే మ్యాన్’ కు ఆంటోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మూవీ జులై 22నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. 



Updated Date - 2022-08-06T21:34:12+05:30 IST