Dhanashree Varma: మాస్ స్టెప్పులతో అదరగొట్టింది..

ABN , First Publish Date - 2022-08-10T19:58:51+05:30 IST

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Varma) తాజాగా నితిన్ (Nithin) సినిమాలోని సాంగ్‌కు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dhanashree Varma: మాస్ స్టెప్పులతో అదరగొట్టింది..

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Varma) తాజాగా నితిన్ (Nithin) సినిమాలోని సాంగ్‌కు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆమె పలు సూపర్ హిట్ సాంగ్స్‌కి డాన్స్ చేసి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్ సెలబ్రిటీగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యారు. తరచుగా తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు, కమర్షియల్ యాడ్ ఫిలింస్ లోనూ ఆమె నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు.


ఈ క్రమంలోనే తాజాగా యూత్‌స్టార్ నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) మూవీలోని 'రా రా రెడ్డి' పాటకి హూషారైన మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటలో పాపులర్ అయిన 'రాను రాను అంటుందే సిన్నదో' పాట రీమిక్స్ క్లిప్ ఈ మధ్య తెగ వైరల్ అయింది. ఇప్పటికే దీనిపై చేసిన ఇన్స్టా రీల్స్ కూడా చాలానే వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే ఈ మాస్ బీట్‌కి ధనశ్రీ కూడా డ్యాన్స్ చేశారు.


ఈ వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రముఖ ఎడిటర్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి (Krithi Setty) హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. 



Updated Date - 2022-08-10T19:58:51+05:30 IST