నిన్ను చూడబుద్దవుతోంది రాజిగో...

ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST

రవితేజ సినిమాల్లో కనిపించే కామన్‌ పాయింట్‌... మంచి మాస్‌ సాంగ్‌.

నిన్ను చూడబుద్దవుతోంది రాజిగో...

రవితేజ సినిమాల్లో కనిపించే కామన్‌ పాయింట్‌... మంచి మాస్‌ సాంగ్‌. సినిమా ఏదైనా, మాస్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసి ఓ పాట వదలడం రవితేజ చిత్రాలకు అలవాటే. తాజాగా... ‘ధమాకా’లోంచి కూడా అలాంటి ఓ మాస్‌ గీతం బయటకు వచ్చింది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూడబుద్దవుతోంది రాజిగో.. మాటాడబుద్దవుతోంది రాజిగో..’ అనే పాట విడుదలైంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన గీతమిది. మంగ్లీ, భీమ్స్‌ ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ రచించారు. జానపద శైలిలో సాగిన పాట ఇది. రవితేజ, శ్రీలీల కెమిస్ర్టీ, స్టెప్పులు ఆకట్టుకొంటున్నాయి. ప్రసన్నకుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి స్ర్కీన్‌ ప్లే, సంభాషణలు అందించారు. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రహణ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST