Kangana Ranaut సినిమాకి భారీ నష్టాలు.. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకున్నారంటూ న్యూస్.. Producer రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-06T23:28:03+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే...

Kangana Ranaut సినిమాకి భారీ నష్టాలు.. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకున్నారంటూ న్యూస్.. Producer రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గతేడాది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. అదే జోష్‌తో ‘ధాకడ్ (Dhaakad)’ అనే లేడీ ఒరియెంటెడ్ స్పై థ్రిల్లర్‌‌లో నటించింది. రజనీశ్ గాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దీపక్ ముకుత్ నిర్మించాడు. ఈ మూవీ మే 20న బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) నటించిన ‘భుల్ భూలయ్యా 2’తో పాటు విడులైంది. అయితే.. కార్తీక్ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోగా.. కంగనా మూవీ మాత్రం డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో రూ.85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి ఫుల్ రన్ రూ.5 కోట్ల కలెక్షన్లు కూడా రాలేదు.


భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ధాకడ్’ చిత్రం ఫ్లాప్‌గా నిలవడంతో నిర్మాతకి భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఓ తరుణంలో ఈ మూవీ ఓటీటీ విడుదల కూడా చాలా కష్టమైందని టాక్ సైతం వినిపించింది. చివరికీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘జీ5’లో జులై 1న విడుదలైంది. అయితే.. ఈ సినిమాకి వచ్చిన నష్టాలతో నిర్మాత దీపక్ భారీగా అప్పుల్లో కూరుకుపోయాడని వార్తలు వినిపించాయి. అందుకే వాటిని తీర్చేందుకు ఆయన ఆఫీస్‌ని, ఇతర ఆస్తులను అమ్ముకున్నట్లు న్యూస్ వచ్చింది. ఈ రూమర్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపక్ స్పందించాడు.


దీపక్ మాట్లాడుతూ.. ‘ఇవి నిరాధారమైన పుకార్లు. పూర్తిగా అసత్యం. పెట్టుబడిలో చాలా భాగాన్ని నేను ఇప్పటికే రాబట్టుకోగలిగాను. మిగిలిన నష్టాలు త్వరలోనే క్లియర్ అవుతాయి’ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఫెయిల్ అయ్యిందనే దానిపై దీపక్ మాట్లాడుతూ.. ‘మేము చాలా నమ్మకంతో ధాకడ్‌ని నిర్మించాం. మంచి ప్రొడక్షన్స్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించిన చిత్రం ఇది. అయినప్పటికీ.. ఎక్కడా తప్పు జరిగిందో నాకు తెలియదు. ఫలితం విషయాన్ని ప్రేక్షకులకే వదిలేయ్యాలని అనుకుంటున్నాం. ఎందుకంటే.. అది వారి ఎంపిక. ఏ సినిమాని చూడాలి. ఏ సినిమాని చూడొద్దని నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంది. కానీ.. మా మూవీ టీంకి మాత్రం మహిళ ముఖ్యపాత్రతో ఈ సినిమాని తెరకెక్కించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-07-06T23:28:03+05:30 IST