Devi Sriprasad: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సారీ..

ABN , First Publish Date - 2022-08-14T15:05:22+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్‌కి సారీ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ (Devi Sri prasad). ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ - సుకుమార్ (Sukumar) - దేవీశ్రీప్రసాద్ ల మధ్య మంచి అనుబంధం

Devi Sriprasad: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సారీ..

అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్‌కి సారీ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ (Devi Sri prasad). ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ - సుకుమార్ (Sukumar) - దేవీశ్రీప్రసాద్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ సాధిస్తుంది. డీఎస్పీకి బన్నీ అంటే ప్రత్యేకమైన అభిమానం. అల్లు అర్జున్ మూవీ అంటే ఎక్కువ ఎఫెర్ట్స్ పెట్టడానికి ఇదీ కూడా ఒక కారణం. అయితే, ఆగస్టు 2వ తేదీన డీఎస్పీ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు.


అయితే, బన్నీ పెట్టిన పోస్ట్ డీఎస్పీ చూసుకోలేదు. చాలా ఆలస్యంగా బన్నీ ట్వీట్ చూసిన రాక్ స్టార్ ఆనందంతో మళ్ళీ రీ ట్వీట్ చేశారు. బన్నీ ఫ్యాన్స్‌కి సారీ చెప్పి..పుష్ప 2 (Pushpa 2) కి మళ్ళీ అదరగొట్టే ఆ ఆల్బమ్ ని కూడా ఐకానిక్ గా మారుద్దామంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక బన్నీ ఫ్యాన్స్ కూడా పుష్ప 2 అప్‌డేట్స్ ఏవీ రావడం లేదని కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. వారికి ఈ ట్వీట్ మంచి ఉత్సాహాన్నిచ్చింది.


కాగా, ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ సినిమా మెగా 154, పుష్ప 2, రంగ రంగ వైభవంగా సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాల సాంగ్స్ రికార్డింగ్, ట్యూన్స్ సిద్ధం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన ది వారియర్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా మ్యూజిక్ పరంగా ఆల్బం హిట్ అయింది.



Updated Date - 2022-08-14T15:05:22+05:30 IST