Devisri Prasad: ఆ ఎనర్జీ సూపర్బ్‌

ABN , First Publish Date - 2022-10-05T01:17:20+05:30 IST

ఈతరం సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ది ప్రత్యేక శైలి. మాస్‌, మెలోడీ, వెస్ట్రన్‌, స్లో సాంగ్‌, ఫాస్ట్‌ బీట్‌, ఐటెమ్‌ సాంగ్‌ అయినా ఆయన బాణీనే వేరు. అందుకే ఆయన్ను మ్యూజిక్‌ మిసైల్‌ అనీ, రాక్‌స్టార్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు.

Devisri Prasad: ఆ ఎనర్జీ సూపర్బ్‌

ఈతరం సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌ది (DEVI SRI PRASAD)ప్రత్యేక శైలి. మాస్‌, మెలోడీ, వెస్ట్రన్‌, స్లో సాంగ్‌, ఫాస్ట్‌ బీట్‌, ఐటెమ్‌ సాంగ్‌ అయినా ఆయన బాణీనే వేరు. అందుకే ఆయన్ను మ్యూజిక్‌ మిసైల్‌ అనీ, రాక్‌స్టార్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా ఆయన హిందీలో ఓ ఆల్బమ్‌ చేశారు. టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌తో కలిసి ‘ఓ పరీ’ (O pari album)అనే ఆల్బమ్‌తో బాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ ఈ పాటను విడుదల చేశారు. ఈ విషయాన్ని డీఎస్‌పీ ట్విటర్‌ వేదికగా తెలిపారు.

‘బాలీవుడ్‌లో నా తొలి పాటను లాంఛ్‌ చేసినందుకు రణ్‌వీర్‌ సింగ్‌కు ధన్యవాదాలు. మీరు నాతో కలిసి స్టేజీపై డాన్స్‌ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ  ఎనర్జీ సూపర్‌’’ అని రణ్‌వీర్‌ను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 






Updated Date - 2022-10-05T01:17:20+05:30 IST