తన సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ఇప్పటికే టాలీవుడ్‌లో హిట్ పాటలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. గతేడాది ‘పుష్ప’ సినిమాకు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలు బంపర్ హిట్ కావడంతో అతడి పేరు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు మారు మోగిపోయింంది. ఈ నేపథ్యంలో రాక్‌స్టార్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు కూడా తమ సినిమాలకు మ్యూజిక్ అందించాలని కోరుతున్నారు. ఈ వార్తలు హల్‌చల్ చేస్తుండగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళీ’ (Kabhi Eid Kabhi Diwali) కి దేవి సంగీతం అందించబోతున్నాడని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్, ర్యాప్ సింగర్ యోయో హనీ సింగ్ (Yo Yo Honey Singh) కలసి తొలిసారి పనిచేయబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘‘తన సినిమాతో సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టే చర్యలు తీసుకుంటున్నాడు. సంగీతంతో సహా సినిమాకు సంబంధించిన ఏ అంశంలో కూడా రాజీ పడటం లేదు. సినిమాలో ఓ ముఖ్యమైన పాట ఉంది. ఈ పాటలో వెంకటేష్, రామ్ చరణ్ కనిపిస్తారు’’ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘కబీ ఈద్, కబీ దివాళీ’లో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది. సిద్దార్థ్ నిగమ్, జెస్సీ గిల్, షెహనాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.