ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. Kangana Ranaut అకౌంట్‌ని రియాక్టివేట్ చేస్తారా అంటూ..

ABN , First Publish Date - 2022-04-27T16:55:37+05:30 IST

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్స్, మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ని ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. Kangana Ranaut అకౌంట్‌ని రియాక్టివేట్ చేస్తారా అంటూ..

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్స్, మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ని ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న దాదాపు 44 బిలియన్ డాలర్లకి కుదిరిన ఈ ఒప్పందం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఒప్పందానికి ముందు ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. ‘ఎంతో భవిష్యత్తు ఉన్న ట్విట్టర్ నేను అనుకున్నట్లు ముందుకు సాగట్లేదు. రకరకాలుగా కొందరి హక్కులకు భంగం కలిగిస్తోంది. ఇప్పటి వరకు పబ్లిక్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ ప్రవేట్ కంపెనీగా మారాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చాడు.


గతంలో జనాలను రెచ్చగొట్టేలా ట్విట్స్ ఉన్నాయని చెబుతూ కంగనా రనౌత్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అకౌంట్స్‌ని ట్విట్టర్ సస్పెండ్ చేసింది. మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో వారి అకౌంట్స్‌ని ట్విట్టర్ రియాక్టివేట్ చేస్తుందా అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా మరికొన్ని మీమ్స్ సైతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందులో.. ‘ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొన్న తర్వాత డోనాల్డ్ ట్రంప్ సెలబ్రేట్ చేసుకుంటాడు’ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. అలాగే.. ఈ డీల్ తర్వాత మరికొందరి ప్రముఖుల రియాక్షన్ ఇది అంటూ ట్విట్స్ చేస్తున్నారు.

















Updated Date - 2022-04-27T16:55:37+05:30 IST