X or Y: లింగ సమానత్వంపై 17 ఏళ్ల కుర్రాడి సినిమా.. 13 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు..

ABN , First Publish Date - 2022-07-24T18:59:19+05:30 IST

లింగ సమానత్వం అనే కాన్సెప్ట్‌పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ 17 ఏళ్ల కుర్రాడు రాసిన కథ..

X or Y: లింగ సమానత్వంపై 17 ఏళ్ల కుర్రాడి సినిమా.. 13 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు..

లింగ సమానత్వం (Gender Equality) అనే కాన్సెప్ట్‌పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ 17 ఏళ్ల కుర్రాడు రాసిన కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన ఆ కుర్రాడి పేరు దేవాన్ష్ సరాఫ్ (Devansh Saraf). ఈ కుర్రాడు లింగ సమానత్వంపై రాసిన కథతో ‘X ఆర్ Y’ తెరకెక్కింది. పుట్టే పిల్లల లింగానికి కారణం తల్లి అనే అపోహ ఉంది. అది కాదు తండ్రిపై మాత్రమే పుట్టే పిల్లలు ఆడ, మగ అనేదానికి కారణం అని ఈ కథ ద్వారా చెప్పనున్నారు.


ఈ మూవీ గురించి దేవాన్ష్ మాట్లాడుతూ.. ‘నేను తొమ్మిదో స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, పిల్లల లింగం పురుషుడిపై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ స్త్రీపై ఆధారపడి ఉండదని తెలుసుకున్నాం. అందుకే ఈ కథ కోసం 50 కంటే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయగా.. కేవలం 10 నుంచి 12 మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. పదిమందిలో మాట్లాడాల్సిన ముఖ్యమైన టాపిక్‌లలో ఇది ఒకటని నాకు అనిపించింది. ఎవరైనా కొడుకు కావాలని కోరుకుంటున్నారంటే.. దానికి కారణం కూతుర్ల వల్ల వచ్చే సమస్యలు కాదు. బయటి జనాలు ఒత్తిడి వల్ల అని నాకు అర్థమైంది. వారితో మాట్లాడిన తర్వాత నాకు ఈ పితృస్వామ్యంపై కథ రాయాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి ఒత్తిడే మా అమ్మకు ఎదురైంది. ఒకానొక సమయంలో, ఆమెను కుటుంబ కార్యక్రమాలలో గాజు గాజులు ధరించడానికి లేదా పూజా కార్యకమాల్లో పాల్గొనడానికి అనుమతించ లేదు’ ఆయన చెప్పుకొచ్చారు.


దేవాన్ష్ ఇంకా మాట్లాడుతూ.. ‘పిల్లల పుట్టుక అనేది ఆడవాళ్ల నియంత్రణలో లేదు. ఎందుకంటే.. ఆడవాళ్లలో కేవలం X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కానీ.. మగవారిలో X, Y రెండు క్రోమోజోములు ఉంటాయి. ఆడవాళ్లలోని Xతో మగవాళ్ల X కలిస్తే అమ్మాయి, Y కలిస్తే అబ్బాయి పుడతారు. ఆ విషయాన్ని ఈ మూవీలో చెప్పాం’ అని తెలిపాడు. షాదాబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా 13 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

Updated Date - 2022-07-24T18:59:19+05:30 IST