Deepika Padukone: షూట్ చేయడానికీ సిద్ధమంటున్న దీపిక

ABN , First Publish Date - 2022-07-25T22:31:08+05:30 IST

భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్న నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పఠాన్’ (Pathaan). షారూఖ్

Deepika Padukone: షూట్ చేయడానికీ సిద్ధమంటున్న దీపిక

భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పఠాన్’ (Pathaan). షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటిస్తున్నాడు. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘పఠాన్’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపిక కూడా యాక్షన్ స్టంట్స్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్ విడుదలైంది. 


‘పఠాన్’ ను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల చేయనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘పఠాన్’ విడుదలకు ఆరు నెలలు మాత్రమే ఉందంటూ దీపిక లుక్‌ను ప్రొడక్షన్ హౌస్ అభిమానులతో పంచుకుంది. ‘‘ఆమె షూట్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీపికా పదుకొణె లుక్ మీకు సమర్పిస్తున్నాం. ఈ చిత్రం 2023, జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది’’ అని యశ్ రాజ్ ఫిలిమ్స్ చెప్పింది. దీపిక లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా సిద్దార్థ్ ఆనంద్ మీడియాతో మాట్లాడాడు. ‘‘దీపికా పదుకొణె పెద్ద స్టార్. ఆమె నటిస్తుండటంతో మా సినిమా భారీగా, ఆసక్తిగా మారింది. యాక్షన్‌తో కూడిన ఆమె లుక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. దీపిక పాత్ర అద్భుతంగా, భీకరంగా ఉంటుంది. ఆ రోల్‌ను చూసి ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్ అవుతారు’’ అని సిద్దార్థ్ ఆనంద్ పేర్కొన్నాడు. దీపికా పదుకొణె వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా ‘ప్రాజెక్ట్-కె’లో నటిస్తుంది. త్వరలోనే ‘ఫైటర్’ను పట్టాలెక్కించనుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు.



Updated Date - 2022-07-25T22:31:08+05:30 IST