బాలీవుడ్ లో తనని ‘పక్కన పెట్టేస్తారే’మోనని భయపడిన Deepika Padukone... కారణం తెలిపిన South బ్యూటీ

ABN , First Publish Date - 2022-05-10T03:23:59+05:30 IST

దీపికా పదుకొణే... నిస్సందేహంగా ఈనాటి బాలీవుడ్ బాక్సాఫీస్ మహారాణి. బీ-టౌన్ స్టార్ హీరోలకు సమానంగా ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కానీ, సూపర్ హిట్స్ తో పాటూ సూపర్ పర్ఫామెన్సెస్ కూడా అందిస్తోన్న దీపిక మరీ అంత ఈజీగా ఇప్పుడున్న నెంబర్ వన్ స్థానానికి చేరుకోలేదు. ఆమె కూడా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని సార్లు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అనుమానాలు మనసులో కలిగాయట. అటువంటి వాటిలో ఒక దానికి కారణం...

బాలీవుడ్ లో తనని ‘పక్కన పెట్టేస్తారే’మోనని భయపడిన Deepika Padukone... కారణం తెలిపిన South బ్యూటీ

దీపికా పదుకొణే... నిస్సందేహంగా ఈనాటి బాలీవుడ్ బాక్సాఫీస్ మహారాణి. బీ-టౌన్ స్టార్ హీరోలకు సమానంగా ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కానీ, సూపర్ హిట్స్ తో పాటూ సూపర్ పర్ఫామెన్సెస్ కూడా అందిస్తోన్న దీపిక మరీ అంత ఈజీగా ఇప్పుడున్న నెంబర్ వన్ స్థానానికి చేరుకోలేదు. ఆమె కూడా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని సార్లు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అనుమానాలు మనసులో కలిగాయట. అటువంటి వాటిలో ఒక దానికి కారణం ‘‘నా దక్షిణాది యాస’’ అంటోంది కన్నడ సుందరి దీపికా పదుకొణే... 


బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోన్న దీపూ తన ప్రయాణం గురించి చెబుతూ... తనని, తన చెల్లెల్ని అమ్మా, నాన్న ఎప్పుడూ ‘అమ్మాయిలు’గా ప్రత్యేకంగా చూడలేదంటోంది. అందుకే, బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు తనకు ఏది కావాలో దాని గురించే ఆమె కృషి చేసిందట. అంతే కానీ, ఓ అమ్మాయిగా పక్కనున్న మగవారితో దీపికా ఎప్పుడూ పోల్చుకోలేదట. అసలు ఆ అవసరమే రాలేదంటోన్న బాలీవుడ్ ‘మస్తానీ’... జీవితంలోని అన్ని అంశాల్లో, రంగాల్లో ఆడవారికి, మగవారికి మధ్య వ్యత్యాసాలు ఉన్నమాట మాత్రం వాస్తవం అని అంగీకరించింది. 


తన కెరీర్ తొలినాళ్ల గురించి వివరిస్తూ ‘‘క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచీ రావటం వల్ల నాకు మొదట్లో బాలీవుడ్ లోకి సహజంగా ఆహ్వనం లభించలేదు. నా దక్షిణాది యాస వల్ల కూడా కొందరు కనుబొమ్మలు ముడి వేసేవారు. దాని వల్ల నన్ను పక్కన పెట్టేస్తారేమోనని ఆందోళన చెందేదాన్ని...’’ అంది దీపిక. 


గ్లామర్ ప్రపంచానికి చెందని ఒక అపరిచితురాలిగా సినీ పరిశ్రమలో కాలుమోపిన దీపికా పదుకొణే ఇప్పుడు సక్సెస్ కి మారుపేరు. ఆ విజయం వల్ల వచ్చిన విశ్వాసం, పరపతిని ‘మార్పు’ కోసం వినియోగిస్తానంటోంది టాలెంటెడ్ బ్యూటీ. సినిమా రంగంతో సంబంధం లేని తాను నటిగా ప్రయాణం మొదలు పెట్టిన కొత్తలో ‘పరిశీలిస్తూ’ ఉండేదట. అదే తాను ‘అప్పటి దాకా ఉన్న పరిస్థితుల్ని’ మార్చేలా చేసిందని ఆమె చెబుతోంది. మున్ముందు కూడా తాను తప్పకుండా ‘మార్పు’కు కారణం అవుతానంటోంది... 


దీపిక ఖాతా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ గా ఉంది. హృతిక్ తో ‘ఫైటర్’, ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’, షారుఖ్ తో ‘పఠాన్’ సినిమాలే కాక ‘ద ఇంటర్న్’ బాలీవుడ్ రీమేక్ లోనూ మిసెస్ రణవీర్ అన్ మిసబుల్ పర్ఫామెన్సెస్ ఇవ్వనుంది... 

Updated Date - 2022-05-10T03:23:59+05:30 IST