Deepika Padukone : ఆ మెడిసిన్స్, స్టెరాయిడ్స్... నా రూపాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేశాయి

ABN , First Publish Date - 2022-01-07T22:10:19+05:30 IST

2020లో మొదలైన కరోనా కలకలం 2021లోనూ కొనసాగింది. ఓమిక్రాన్ దెబ్బతో 2022లో కూడా కరోనా సీక్వెల్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే, కోవిడ్ మహమ్మారికి సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏదీ ఉండటం లేదు. అందర్నీ ఆటాడుకుంటోంది. గతేడాది దీపికా పదుకొణే ఫ్యామిలీ మొత్తం వైరస్ బారిన పడి ఇబ్బందిపడాల్సి వచ్చింది.

Deepika Padukone : ఆ మెడిసిన్స్, స్టెరాయిడ్స్... నా రూపాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేశాయి

2020లో మొదలైన కరోనా కలకలం 2021లోనూ కొనసాగింది. ఓమిక్రాన్ దెబ్బతో 2022లో కూడా కరోనా సీక్వెల్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే, కోవిడ్ మహమ్మారికి సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏదీ ఉండటం లేదు. అందర్నీ ఆటాడుకుంటోంది. గతేడాది దీపికా పదుకొణే ఫ్యామిలీ మొత్తం వైరస్ బారిన పడి ఇబ్బందిపడాల్సి వచ్చింది. 

సినీ ప్రముఖులకి కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ రావటం ప్రస్తుతం నిత్యకృత్యం అయిపోయింది. అయితే, వ్యాధి సోకిన క్షణంలో వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో మనందరికి కూడా తెలిసిందే. ప్రాణాంతకంగా మారే కరోనా ఎవరినైనా ఒకే స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేయగలదు. అదే జరిగిందట దీపికా విషయంలోనూ. ఆమెతో పాటూ తన కుటుంబం మొత్తానికి ఇన్‌ఫెక్షన్ రావటంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైందట. అంతే కాదు, కరోనా తగ్గేందుకు డాక్టర్లు ఇచ్చిన మందులు, స్టెరాయిడ్స్ మరింత సమస్యగా మారాయట. వాటి ప్రభావం వల్ల దీపిక ఒక దశలో గుర్తుపట్టరానంతగా మారిపోయిందట. శారీరికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ‘‘కోవిడ్-19 ఒక వింత స్థితి... మనం గతంలో ఎప్పుడూ లోనుకాని మానసిక స్థితికి గురైపోతాం!’’ అంది దీపికా. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంవత్సరం క్రితం తన కుటుంబాన్ని కుదిపేసిన కరోనా సంక్షోభం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది... 

Updated Date - 2022-01-07T22:10:19+05:30 IST