స్పెయిన్‌లోని తన ‘కొత్త ఇంటి’ ఫోటో షేర్ చేసిన Deepika Padukone!

ABN , First Publish Date - 2022-03-07T23:22:55+05:30 IST

దీపికా పదుకొణే తన కొత్త ఇంటి ఫోటోని నెటిజన్స్‌తో షేర్ చేసింది! అదీ ఇండియాలోది కాదు... యూరప్‌లోని స్పెయిన్‌లో ఉన్న ‘న్యూ హోమ్’! అయితే, ఆగండాగండీ... మిసెస్ రణవీర్ అక్కడెక్కడో సెటిలైపోవటం లేదు. జస్ట్ ఓ నెల రోజుల పాటూ మకాం వేయనుంది. అదే సంగతిని సొషల్ మీడియాలో తెలిపింది కూడా...

స్పెయిన్‌లోని తన ‘కొత్త ఇంటి’ ఫోటో షేర్ చేసిన Deepika Padukone!

దీపికా పదుకొణే తన కొత్త ఇంటి ఫోటోని నెటిజన్స్‌తో షేర్ చేసింది! అదీ ఇండియాలోది కాదు... యూరప్‌లోని స్పెయిన్‌లో ఉన్న ‘న్యూ హోమ్’! అయితే, ఆగండాగండీ... మిసెస్ రణవీర్ అక్కడెక్కడో సెటిలైపోవటం లేదు. జస్ట్ ఓ నెల రోజుల పాటూ మకాం వేయనుంది. అదే సంగతిని సొషల్ మీడియాలో తెలిపింది కూడా... 


దీపికా పదుకొణే మరోసారి షారుఖ్ సరసన నటిస్తూ ఇప్పటికే ‘పఠాన్’ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, పదే పదే ఎదురవుతోన్న కరోనా గండాల్ని దాటుకుంటూ కొంచెం, కొంచెంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు, ఫిల్మ్ మేకర్స్. తాజాగా ‘పఠాన్’ టీమ్ స్పెయిన్ బాట పట్టింది. అక్కడ నెల రోజుల పాటూ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగనుంది. మరి ఇంపార్టెంట్ షెడ్యూల్లో హీరోయిన్ దీపికా లేకుంటే ఎలా? అందుకే, లేడీ పఠాన్ ఆల్రెడీ స్పెయిన్ చేరుకుంది. అక్కడ ఆమె మకాం చేసిన చోటి నుంచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ షేర్ చేసింది. పచ్చటి చెట్లతో ఆహ్లాదంగా ఉన్న ‘వ్యూ’ చూపిస్తూ... ‘న్యూ హోమ్’ అని కామెంంట్ చేసింది! అంటే మరికొద్ది రోజులు అదే చోట తానుండబోతున్నానని దీపిక ఉద్దేశం అన్నమాట. ఇక స్పెయిన్ నుంచీ మరో ఫోటో కూడా షేర్ చేసిన ‘పఠాన్’ బ్యూటీ ‘లేజీ సండే’ అంటూ తన నో మేకప్ లుక్ నెటిజన్స్‌తో పంచుకుంది! 


షారుఖ్ ఖాన్‌తో గతంలో ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్సెప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి సినిమాలు చేసింది దీపికా. ఇప్పుడు మరోసారి బాద్షాతో జోడీ కట్టింది ‘బాజీరావ్’ బ్యూటీ. వీరిద్దరూ కలసి నటిస్తోన్న ‘పఠాన్’ 2023 జనవరి 25న విడుదల కానుంది.   

Updated Date - 2022-03-07T23:22:55+05:30 IST