Viral Video: అలియాభట్‌తో రొమాంటిక్ డ్యాన్స్.. రణ్‌‌బీర్‌ కపూర్‌ మాజీ ప్రియురాళ్లు కత్రినా, దీపికా రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-10T16:22:20+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి గురించి రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే...

Viral Video: అలియాభట్‌తో రొమాంటిక్ డ్యాన్స్.. రణ్‌‌బీర్‌ కపూర్‌ మాజీ ప్రియురాళ్లు కత్రినా, దీపికా రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి గురించి రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 నుంచి 16 మధ్య వారి పెళ్లి జరుగనుందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వారిద్దరూ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో.. ఒక అవార్డు ఫంక్షన్‌లో, రణబీర్, అలియా జంట ఆ షోని హోస్ట్ చేస్తున్న విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్‌తో కలిసి వేదికపై ఉన్నారు. సరిగ్గా అప్పుడే విక్కీ డ్యాన్స్ చేయమని అలియా, రణబీర్‌‌ను అడిగాడు. దాన్ని అలాగే కార్తీక్‌తో కలిసి తాను అనుకరిస్తానని చెప్పాడు. దీంతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఇష్క్ వాలా లవ్ పాటకు ఆ కపుల్ రొమాంటిక్ డ్యాన్స్ చేశారు.


అయితే.. అలియాతో కలిసి డ్యాన్స్ చేయడానికి రణబీర్ అంగీకరించగానే కత్రినా కైఫ్ గట్టిగా నవ్వేసింది. అలాగే దీపికా పదుకొనే సైతం ఆ జంట డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిరునవ్వుతో చూసింది. అలాగే వారు డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే అక్కడ ఉన్న సెలబ్రిటీలు అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-04-10T16:22:20+05:30 IST