డాటర్స్‌ డే స్పెషల్‌!

ABN , First Publish Date - 2022-09-26T06:38:06+05:30 IST

మహేశ్‌ బాబు పక్కా ఫ్యామిలీమాన్‌. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబానికే కేటాయిస్తారు. వాళ్లతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు...

డాటర్స్‌ డే స్పెషల్‌!

మహేశ్‌ బాబు పక్కా ఫ్యామిలీమాన్‌. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబానికే కేటాయిస్తారు. వాళ్లతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. షూటింగ్‌ లేకపోతే... ఆయన కాలక్షేపం గౌతమ్‌, సితారలతోనే. ఏ చిన్న సందర్భం వచ్చినా పిల్లలతో కలిసి ఉన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకొంటారు. ఈరోజు డాటర్స్‌ డే. అందుకే తన ముద్దుల కూతురు సితారతో కలిసి ఉన్న ఈ ఫొటోని ఇన్‌స్టాలో అభిమానులతో షేర్‌ చేసుకొన్నారు మహేశ్‌. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌ గా మారింది. మహేశ్‌ - సితారలను ఇలా చూడడం అభిమానులకు ఎప్పుడూ ఆనందమే. పైగా.. ఈ ఫొటోలో మహేశ్‌ లుక్‌ కొత్తగా ఉంది. ఎప్పుడూ లేనిది ఆయన గెడ్డంతో కనిపిస్తున్నారు. అందుకే మరింత స్పెషల్‌గా మారింది.  


Updated Date - 2022-09-26T06:38:06+05:30 IST