Dasara: కొత్త పోస్టర్ వైరల్..

ABN , First Publish Date - 2022-08-07T17:49:13+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ (Dasara). తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Dasara: కొత్త పోస్టర్ వైరల్..

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ (Dasara). తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే, నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా దసరా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు.  


ఇందులో నానితో పాటుగా ఇతర నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే నాని ఇంట్రో సాంగ్‌లోనిది అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే, దసరా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ఓ పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డార‌ట‌. తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మేకర్స్ భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీక‌రణ జరుపున్నారు. అయితే, షూటింగ్‌లో స‌మ‌యంలో ట్ర‌క్ నుంచి బొగ్గు నానిపై ప‌డిందట. అయితే నానికి పెద్ద‌గా గాయాలేమీ కాలేదని సమాచారం. 


ప్రస్తుతం నాని ఈ మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే ఈ ఏడాది డిసెంబర్‌లో పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాల భాషలలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. గత ఏడాది డిసెంబర్ నెలలోనే ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో వచ్చి నాని హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ‘అంటే సుందరానికి’ మూవీతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. మరి నానికి దసరా మూవీ పాన్ ఇండియా హీరోగా సకెస్ ఇస్తుందో లేదో చూడాలి.  

Updated Date - 2022-08-07T17:49:13+05:30 IST