Dasara : విడుదల ఎప్పుడంటే.. !

ABN , First Publish Date - 2022-08-26T17:34:48+05:30 IST

నేచురల్ స్టార్ నానీ (Nani) తాజాగా నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Dasara : విడుదల ఎప్పుడంటే.. !

నేచురల్ స్టార్ నానీ (Nani) తాజాగా నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthi Suresh) కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వహాబ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ ఛాయా గ్రాహణం నిర్వహిస్తున్నాడు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.  


ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ 30న విడుదల చేస్తున్నట్టు ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. పెద్ద సిల్క్ స్మిత (Silk Smitha) పోట్రైట్ ముందు నానీ కూర్చునే లుక్ ఆకట్టుకుంటోంది. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలోని మాస్ లవ్ స్టోరీగా ‘దసరా’ తెరకెక్కుతోంది. ఇందులోని నానీ మేకోవర్, అపీరెన్స్ మెప్పిస్తోంది. ఈ సినిమా కోసం నానీ మొట్టమొదటి సారిగా పూర్తి తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్ పలకడం విశేషం. దాని కోసం నానీ బాగా కసరత్తు చేశాడట. 


నానీ గత చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) బాక్సాఫీస్ వద్ద అంతగా మ్యాజిక్ చేయలేకపోవడంతో... ‘దసరా’ చిత్రంపైనే నానీ పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే చిత్రాన్ని అభిమానుల్ని మెప్పించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ‘నేను లోకల్’ తర్వాత కీర్తి సురేశ్‌తో నానీ మరోసారి రొమాన్స్ చేయనుండడం విశేషం. ఈ ఇద్దరిపై వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. పీరియాడికల్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో  ఒకప్పటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తు్న్నాడు దర్శకుడు. మరి ఈ సినిమా నానీకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.  



Updated Date - 2022-08-26T17:34:48+05:30 IST