Dasara: సిల్క్ బార్‌లో.. ధూమ్ ధామ్ అంటూ దుమ్ములేపారు

ABN , First Publish Date - 2022-10-04T02:18:39+05:30 IST

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఈసారి ఊరమాస్ లుక్‌లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా

Dasara: సిల్క్ బార్‌లో.. ధూమ్ ధామ్ అంటూ దుమ్ములేపారు

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఈసారి ఊరమాస్ లుక్‌లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘నేను లోకల్’ (Nenu Local) సినిమా తర్వాత మరోసారి నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన నాని మాస్ అవతారంలో ఉన్న పిక్స్.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాలో ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ (DhoomDhaamDhosthaan) సింగల్ వదిలారు మేకర్స్. ఫుల్ సాంగ్ వదలడానికి ముందు వచ్చిన చిన్న చిన్న ప్రోమో వీడియోలు ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని వేచి చూసేలా చేశాయి. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. దసరా పండుగను పురస్కరించుకుని ‘దసరా’లోని ఈ దుమ్మురేపే సాంగ్‌ని వదిలారు. 


తెలంగాణ-శైలి జానపదంతో మొదలైన ఈ పాట.. 


‘‘పవ్వగొట్టు పవ్వగొట్టు.. బొటికూర దాంచుకు వెట్టు

బ్యాండు గొట్టు.. బ్యాండు గొట్టు వాడకట్టు లేసూగెటట్టు..

గుద్దితే సూస్కో.. ఓ అర్ధసేరు.. గజ్జల గుర్రం ఈ సిల్క్ బారు

ఇచ్చి పడేద్దాం.. చల్, గుచ్చి పడేద్దాం.. ఎవ్వడడ్డమొస్తడోజూద్దాం.. బాంచత్!!

ధూమ్ ధామ్ ధోస్థాన్.. ఇరగ మరగ చేద్దాం.. ధూమ్ ధామ్ ధోస్థాన్ ఇరగ మరగ చేద్దాం’’ అంటూ ఊర మాస్ స్టెప్పులతో సాగిన ఈ పాటలో కనకవ్వ పాడిన ‘బతకమ్మ’ పాటని కూడా చేర్చారు. ఈ పాటలో నాని లుక్, మేకోవర్‌కి మునుపెన్నడూ చూడని విధంగా వుంది. నాని, అతని బ్యాచ్ అద్భుతమైన,  డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో బొగ్గు గనులలో దుమ్ము రేపారు. ఈ పాటను సంతోష్ నారాయణ్ కంపోజ్ చేయగా.. రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాస లక్ష్మి పాడారు. తెలంగాణ స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటకు ఆకట్టుకునేలా సాహిత్యం అందించారు. మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్‌లా.. మాస్ జాతరే అన్నట్లుగా ఉందీ పాట. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదలచేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Dasara movie Dhoom Dhaam Dhosthaan song)



Updated Date - 2022-10-04T02:18:39+05:30 IST