‘The Kashmir Files’ నా జీవితాన్ని మార్చేసింది.. అలాంటి వారిని కూడా.. : Darshan Kumar

ABN , First Publish Date - 2022-05-26T18:06:30+05:30 IST

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’. స్టార్స్‌ లేకుండానే సూపర్ హిట్ సాధించిన...

‘The Kashmir Files’ నా జీవితాన్ని మార్చేసింది.. అలాంటి వారిని కూడా.. : Darshan Kumar

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’. స్టార్స్‌ లేకుండానే సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా రూ.250 కోట్లకి పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన యాక్టర్స్‌కి సైతం మంచి పేరునే సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించిన దర్శన్ కుమార్ ఈ సినిమా తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


దర్శన్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు నా ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని సైతం వారు ఇప్పుడు తమ సినిమాలలో లీడ్‌ రోల్‌గా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జూన్ 3న కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాను. అందులో నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నాను‌. అయితే.. గతంలో దర్శకులు నాతో కలిసి పని చేసేందుకు ఇంట్రస్ట్ చూపించిన.. నిర్మాతలు మాత్రం అంతగా స్పందించేవారు కాదు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది’ అని చెప్పుకొచ్చాడు.


దర్శన్ ‘ఆశ్రమ్’ వెబ్‌సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడికి వెళ్లినా, ఏదైనా సినిమా ప్రమోషన్స్‌‌లో పాల్గొన్నా.. అందరు మొదటి ప్రశ్నగా ఆశ్రమ్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అంతెందుకు.. నేను సోషల్ మీడియా పోస్ట్‌ పెడితే మొదటి కామెంట్ ఆ వెబ్‌సిరీస్‌ గురించే ఉంటుంది. అభిమానుల్లో ఇలాంటి ఎగ్జాయిట్‌మెంట్ చూసినప్పుడు నటులపై భారం భారీగా పెరుగుతుంది. అయితే ఈ సీజన్ ఖచ్చితంగా చాలా వినోదాత్మకంగా ఉంటుందని హామీ మాత్రం ఇవ్వగలను. జూన్‌లో వచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త సీజన్‌ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ తెలిపాడు.

Updated Date - 2022-05-26T18:06:30+05:30 IST