Darlings: ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ చేసిన తప్పే చేస్తున్న ఆలియా భట్.. అదేంటంటే..

ABN , First Publish Date - 2022-08-10T18:44:38+05:30 IST

ఆమీర్ ఖాన్ నటించిన మూవీ ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’, అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘రక్షా బంధన్(Raksha Bandhan)’..

Darlings: ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ చేసిన తప్పే చేస్తున్న ఆలియా భట్.. అదేంటంటే..

ఆమీర్ ఖాన్ నటించిన మూవీ ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’, అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘రక్షా బంధన్(Raksha Bandhan)’ ఒకే రోజు అంటే ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఆమీర్ చిత్రం మాత్రం తెలుగు, తమిళంలోనూ విడుదలకానుంది. కాగా.. ఒకేరోజు ఇద్దరూ స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడంతో ఏ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందోనని ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.


కాగా.. ఈ రెండు సినిమాల నిర్మాతలు ఓ తప్పు చేశారు. నిజానికి ఆగస్టు 5న ఏ పెద్ద సినిమా విడుదలకాలేదు. అలాంటి సువర్ణావకాశాన్ని ఈ రెండు సినిమాలు జారవిడుచుకున్నాయి. అదే తప్పుని ఆలియా భట్ సినిమా మేకర్స్ కూడా చేశారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదల కానుంది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌లో షారుక్‌ఖాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఆయన గతంలో నిర్మించిన చిత్రం ‘జుండ్’. అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అలాగే.. ఇటీవలే విడుదలైన ‘డార్లింగ్స్(Darlings)’ ట్రైలర్ సైతం మంచి రెస్సాన్స్ అందుకుంది. అలాగే.. ‘గంగుభాయి కతియావాడి’ క్రేజ్ ఎలాగూ ఉంది. దీంతో అమితాబ్‌ మూవీని విడుదల చేసినట్లు ఆలియా చిత్రాన్ని ఎందుకు థియేటర్స్‌లో విడుదల చేయట్లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ఏ సినిమాలు లేని ఆగస్టు 5న విడుదల చేసినట్లైతే మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆమీర్, అక్షయ్ సినిమాల మేకర్స్ చేసిన తప్పునే ఆలియా మూవీ మేకర్స్ సైతం చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-08-10T18:44:38+05:30 IST