Darja: అనసూయ చేసిన పాత్రకి ముందుగా వారిని అనుకున్నారట..

ABN , First Publish Date - 2022-07-22T01:07:06+05:30 IST

అనసూయగారిలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’ సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న గొప్ప నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్‌

Darja: అనసూయ చేసిన పాత్రకి ముందుగా వారిని అనుకున్నారట..

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్ (Sunil), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’ (Darja). ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సలీమ్ మాలిక్ (Salim Malik) దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి (Sivasankar Paidipaty) ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి (Ravi) పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


వారు మాట్లాడుతూ..

‘‘మా పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన మొదటి చిత్రం జూలై 22న విడుదల కాబోతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఫస్ట్ సినిమా కావడంతో కాస్త నెర్వస్‌గా ఫీలవుతున్నాం. ఈ సినిమా అనుకున్నప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి వంటివారి పేర్లను అనుకున్నాం. తర్వాత జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. టీమంతా అనసూయగారి పేరు రాగానే.. 100 శాతం ఆమె అయితేనే బాగుంటుందని అన్నారు. ప్రభుగారి ద్వారానే అనసూయగారిని సంప్రదించడం.. ఆమెకు ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే చేస్తానని తెలిపారు.


అనసూయగారిలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’ సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న గొప్ప నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్‌ విషయానికి వస్తే మాకు అనసూయగారే కనిపించారు. ఫస్ట్ సినిమాకి సంబంధించి వేసిన స్కెచ్‌లో సేమ్ టు సేమ్ ‘పుష్ప’ లుక్కే వచ్చింది. ఈ స్టోరీ విన్నాక..  సుకుమార్‌గారిలాగే నా గురించి ఆలోచించారని అనసూయగారు మాకు థ్యాంక్స్ చెప్పారు. మొత్తం మూడు స్కెచ్‌లు రెడీ చేశాం. అందులో అనసూయగారు ప్రస్తుతం సినిమాలో కనిపించిన లుక్.. స్కెచ్‌ని ఓకే చేశారు. ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం. ఒక పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన యువతి.. పెద్ద అయిన తర్వాత ప్రజలకు ఎలా ప్రాబ్లమ్‌గా మారింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం. నిర్మాతలుగా మాకిది మొదటి చిత్రం. కానీ ఇంతకు ముందు కొన్ని చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. 


మొదటి సినిమాగా ఇలాంటి స్టోరీ చేయడానికి కారణం.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాం (నిర్మాతలుగా). రావడమే పెద్ద హీరోలతో సినిమాలు అంటే.. జరిగే పని కాదు. అందుకే ముందు ‘దర్జా’ వంటి చిత్రంతో మేమేంటో తెలియజేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో మా బ్యానర్ పేరు ఇండస్ట్రీకి తెలుస్తుంది. తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తాం.


సునీల్‌గారు, అనసూయగారు ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ మొదట్లో వారి డేట్స్ కోసం ఇబ్బంది పడ్డాం. కానీ వారు డేట్స్ ఇచ్చిన తర్వాత మాత్రం అంతా సాఫీగానే సాగింది. వారు ఇంతగా సపోర్ట్ చేశారు కాబట్టే.. ‘దర్జా’ ఈ రోజు దర్జాగా రెడీ అయింది. ముందు చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాని చేయాలని అనుకున్నాం. సునీల్‌గారు, అనసూయగారు యాడ్ అయిన తర్వాత.. అవుట్‌ఫుట్ అద్భుతంగా వస్తుండటంతో.. ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాం. క్వాలిటీ, అవుట్‌పుట్ చూసిన తర్వాత.. బడ్జెట్ విషయంలో వెనుకాడలేదు. అందులోనూ ఇది మా మొదటి చిత్రం. నిర్మాణం పరంగా మంచి క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు. 


- మొదటి నుండి ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత టీమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాతో కొత్తగా పరిచయం అవుతున్న వారందరికీ ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. సెన్సార్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ విన్నాం. యాక్షన్‌తో నిండిన సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. కామెడీ, డ్యాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. మేము ‘దర్జా’ సినిమా తీశాం. ప్రేక్షకులు ‘దర్జా’గా థియేటర్లకి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. సునీల్‌గారికి, అనసూయగారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ నిజంగా మాకు ఎంతో బలాన్నిచ్చింది. అలాగే సలీమ్ మాలిక్, ర్యాప్ రాక్ షకీల్, కెమెరామెన్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని పొందాము. డే 1 నుండి ఓ పెద్ద చిత్రానికి సపోర్ట్ చేసినట్లుగా మీడియా మాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. మీడియాకు కూడా ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 400 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. విడుదల తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మా బ్యానర్‌లో ముందు ముందు ఫ్యామిలీ అండ్ యాక్షన్ అలాగే అడ్వెంచర్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాం. తర్వాత ప్రాజెక్ట్ కూడా ఫ్యామిలీ అండ్ యాక్షన్ చిత్రమే ఉంటుంది.

Updated Date - 2022-07-22T01:07:06+05:30 IST