James Bond కోసం రూల్స్ బ్రేక్ చేసిన బ్రిటన్ రాణి... విమర్శిస్తోన్న జనం...

ABN , First Publish Date - 2022-01-03T03:42:52+05:30 IST

ఇప్పటి వరకూ ప్రపంచ ప్రఖ్యాత గూఢచారిగా అయిదు బాండ్ చిత్రాల్లో కనిపించిన డేనియల్ క్రెయిగ్‌ను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. రియల్ లైఫ్ స్పైస్, డిప్లోమాట్స్‌కు మాత్రమే అందించే ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖెల్ అండ్ సెయింట్ జార్జ్(సీఎంజీ)’ అవార్డ్ వెండి తెర జేమ్స్ బాండ్‌కు అందించారు. ఇది నిజానికి సంప్రదాయానికి విరుద్ధం...

James Bond కోసం రూల్స్ బ్రేక్ చేసిన బ్రిటన్ రాణి... విమర్శిస్తోన్న జనం...

ఇప్పటి వరకూ ప్రపంచ ప్రఖ్యాత గూఢచారిగా అయిదు బాండ్ చిత్రాల్లో కనిపించిన డేనియల్ క్రెయిగ్‌ను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. రియల్ లైఫ్ స్పైస్, డిప్లోమాట్స్‌కు మాత్రమే అందించే ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖెల్ అండ్ సెయింట్ జార్జ్(సీఎంజీ)’ అవార్డ్ వెండి తెర జేమ్స్ బాండ్‌కు అందించారు. ఇది నిజానికి సంప్రదాయానికి విరుద్ధం. కేవలం గూఢచారులకి, రాయబారులకి మాత్రమే ఇవ్వాల్సిన ప్రతిష్ఠాత్మక పురస్కారం బ్రిటన్ రాణి ఈసారి సినిమా హీరోకు ప్రదానం చేసేశారు!  


రూల్స్‌ని బ్రేక్ చేసి ‘సీఎంజీ’ అవార్డుని సినీ గూఢచారికి ఇవ్వటం చాలా మంది బ్రిటన్ ప్రజలకు నచ్చటం లేదు. సొషల్ మీడియాలో అందుక్కారణం అయిన అధికారుల్ని గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే, క్రెయిగ్‌కి బ్రిటన్ మహారాణి చేతుల మీదుగా గౌరవం దక్కటం ‘నో టైం టూ డై’ సినిమా వల్లే జరిగిందట. ఆ సినిమాతో బ్రిటన్ పౌరుడైన డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్రకు గుడ్ బై చెప్పేశాడు. అదే బాండ్‌గా అతడి చివరి సినిమా. ఇకపై తమ ప్రపంచ ప్రఖ్యాత అందగాడు ఏజెంట్ 007గా కనిపించడనే అతడికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారం అందించింది. కానీ, అందుకోసం నిజ జీవిత గూఢచారులకి ఇవ్వాల్సిన అవార్డ్‌ని దారి మళ్లించటం కొందరికి మాత్రం అస్సలు నచ్చటం లేదు. చూడాలి మరి, తన కాంట్రవర్సియల్ ఆనర్‌పై మాజీ జేమ్స్ బాండ్ ఎలా రియాక్ట్ అవుతాడో... 

Updated Date - 2022-01-03T03:42:52+05:30 IST