సెక్స్ అనే పదం భారత్‌లో ఉపయోగించడానికి భయపడతారంటున్న దంగల్ హీరోయిన్

ABN , First Publish Date - 2021-10-21T01:26:48+05:30 IST

భారత్‌లో సెక్స్ అనే పదం బాహాటంగా ఉపయోగించటానికి అందరూ భయపడతారని ఒక హీరోయిన్ అంటుంది. సినిమాలతో పాటు ఇతర మాధ్యమాలను అందరూ విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో

సెక్స్ అనే పదం భారత్‌లో ఉపయోగించడానికి భయపడతారంటున్న దంగల్ హీరోయిన్

భారత్‌లో సెక్స్ అనే పదం బాహాటంగా ఉపయోగించటానికి అందరూ భయపడతారని ఒక హీరోయిన్ అంటుంది. సినిమాలతో పాటు ఇతర మాధ్యమాలను అందరూ విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో ఆ పదం వాడుకలోకి వస్తుందని ఆమె చెప్పింది.


దంగల్ చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన నటి సాన్యా మల్హోత్రా. ‘‘ ససురల్ వండర్ పూల్ ’’ అనే షోను ఆమె చేసింది. ఆ షో అడిబుల్‌లో ప్రసారమవుతోంది.  షోలో వరుణ్ శర్మ సరసన ఆమె నటించింది. రొమాంటిక్ కామెడీగా అది తెరకెక్కింది. షోలో ఆమె క్యారెక్టర్ పేరు ఆశిమా. సెక్స్ థెరపిస్ట్ అయిన వరుణ్‌ను ఆమె పెళ్లాడుతుంది. అతడి కుటుంబం మొత్తం సెక్స్ క్లినిక్‌ను నడిపే వ్యాపారంలో ఉంటుంది. ఈ షో ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ..‘‘ భారత్‌లో సెక్స్ అనే పదం కచ్చితంగా నిషిద్ధం. సినిమాతో పాటు ఇతర ప్లాట్ ఫామ్స్‌తో అది మారుతుందని నేను ఆశిస్తున్నాను. ససురల్ వండర్ పూల్ వంటి షోలపై  ప్రేక్షకులు  ఆసక్తి కనబరుస్తున్నారు. అటువంటి కథలకు డిమాండ్ పెరగడంతో నిర్మాతలు వాటిని రూపొందించడానికి వెనుకాడబోరు ’’ అని వివరించింది.


‘‘ మేం ఈ షోతో కొంత మందినైనా మార్చగలమని ఆశిస్తున్నాం. షోతో స్ఫూర్తి పొంది కొందరైనా సరే సెక్స్ ఆధారిత విషయాల గురించి బాహాటంగా చర్చిస్తారనుకుంటున్నాం. ససురల్ వండర్ పూల్‌లో నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్ర బుద్ధిమంతురాలిగా ఉంటుంది. ఆమె బాహాటంగా సెక్స్ గురించి చర్చించదు. ఈ షో మన సమాజానికి  అద్దం పడుతుంది. భర్తతో సహా మొత్తం కుటుంబం సెక్స్ క్లినిక్ నడుపుతారని తెలియగానే ఆమె షాక్ కు గురవుతుంది. కుటుంబంలో అందరూ బాహాటంగా మాట్లాడుతుండటంతో  జీవన ప్రయాణంలో ఆమె ఏలా మారిందనేదే కథ ’’ అని ఆమె చెప్పింది.


‘‘వరుణ్ శర్మ నటన అంటే నాకు ఎంతో ఇష్టం. అతడి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. వరుణ్ శర్మతో కలసి పనిచేసే అవకాశం లభించగానే వెంటనే నేను ఓకే చెప్పాను. ఇదొక ఎక్స్‌పరిమెంట్ అని నాకు తెలుసు. దీనిలో భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె తెలిపింది. కొత్త ప్లాట్ ఫామ్స్‌పై  పనిచేయడం బాగుందని ఆమె చెప్పింది. ససురల్ వండర్ పూల్‌ను గత ఏడాది మహమ్మారి సమయంలో రికార్డ్ చేశారు. షో అడిబుల్‌లో అందుబాటులో ఉంది. అడిబుల్ అంటే వినే ప్లాట్ ఫామ్ అని అందరికీ తెలిసిందే.

Updated Date - 2021-10-21T01:26:48+05:30 IST