ఆ విషయంలో Ranbir Kapoor-Alia Bhatt‌ని ఫాలో అయిన కొత్త జంట.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-04-19T19:26:54+05:30 IST

పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో మ్యారేజ్..

ఆ విషయంలో Ranbir Kapoor-Alia Bhatt‌ని ఫాలో అయిన కొత్త జంట.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో మ్యారేజ్ తర్వాత పార్టీలో ఈ కపుల్ ముద్దు వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే.. అలా వారిద్దరూ ముద్దు పెట్టుకోవడం నచ్చని పలువురు నెటిజన్లు ఆ కపుల్‌పై విమర్శలు సైతం చేశారు. అదేవిధంగా పెళ్లిలో అందరిముందు లిప్‌లాక్ చేసి మరో నటుడు విమర్శల పాలయ్యాడు.


ప్రముఖ వీజే, నటుడు సైరస్ సాహుకర్‌కి వైశాలి మల్హారాతో వివాహమైంది. 41 ఏళ్ల సాహుకర్ దాదాపు ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత వైశాలిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఆ వేడుకకి సంబంధించిన పిక్స్‌ని ఈ నటుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారాయి. అయితే.. అందులో ఓ ఈ జంట లిప్‌లాక్ పిక్ కూడా ఉంది. దీంతో అలాంటి కల్చర్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ‘ఇండియాకి ఈ సంస్కృతిని ఎక్కడి నుంచి తెచ్చారు’, ‘మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం కదా’, ‘రణ్‌బీర్ కపూర్, అలియా జంటని కాపీ కొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-19T19:26:54+05:30 IST